Captain Miller Twitter Review: ధనూష్ మూవీకి ఊహించని టాక్.. కెప్టెన్ మిల్లర్ ఎలా ఉందంటే!
విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న హీరోనే ధనూష్. చాలా ఏళ్లుగా కోలీవుడ్‌లో వరుస పెట్టి సినిమాలు చేస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో మంచి ఉత్సాహంతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'కెప్టెన్ మిల్లర్' అనే సినిమాను చేశాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ మూవీకి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చింది? ధనూష్ మరో హిట్‌ను అందుకున్నాడా? అనేవి చూసేద్దాం పదండి!
కెప్టెన్ మిల్లర్‌గా ధనూష్ : కోలీవుడ్ స్టార్ ధనూష్ నటించిన తాజా చిత్రమే 'కెప్టెన్ మిల్లర్'. అరుణ్ మతేశ్వరన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా.. శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు.

అలాంటి స్టోరీతో కెప్టెన్ : ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టోరీలను సెలెక్ట్ చేసుకునే ధనూష్ ఇప్పుడు 'కెప్టెన్ మిల్లర్' మూవీని చేశాడు. ఇది బ్రిటీష్ నేతృత్వంలోని భారత సైన్యంపై దురాగతాన్ని చూసి పోరాడే వ్యక్తి కథతో రూపొందినట్లు తెలిసింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఆరంభం నుంచీ నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కించి సంక్రాంతి కానుకగా తీసుకు వచ్చారు.
గందరగోళంగా ఉందని : ధనూష్ నటించిన 'కెప్టెన్ మిల్లర్' మూవీకి వీక్షించిన ఓ నెటిజన్ 'కెప్టెన్ మిల్లర్ స్టోరీ స్వాతంత్య్రానికి పూర్వం కథతో రూపొందిన సినిమా. ఇందులో అసమానాతలకు వ్యతిరేకంగా హీరో చేసే పోరాటాన్ని చూపించారు. ఇది స్వాతంత్య్ర పోరాటంతో పాటు అసురన్, కర్ణన్‌ను పోలి ఉంటుంది. మొదటి సగం మాత్రం గందరగోళంగా ఉంది' అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఫస్టాఫ్ ఎలా ఉందంటే : అరుణ్ మతేశ్వరన్ - ధనూష్ కాంబినేషన్‌లో రూపొందిన 'కెప్టెన్ మిల్లర్' మూవీకి చూసిన మరో నెటిజన్ ఇలా స్పందించారు. 'కెప్టెన్ మిల్లర్ ఫస్టాఫ్ పూర్తైంది. ఇందులో ఇంటర్వెల్ సీక్వెన్స్ పర్వాలేదు. కానీ, మంచిగా సెట్ చేయలేదు. ఫైట్స్ మొత్తం సింక్ అవలేదు. ఇప్పటి వరకూ మొత్తం యావరేజ్‌గా ఉంది. ఫస్టాఫ్‌కు నా రేటింగ్ 2/5' అని చెప్పుకొచ్చారు.
అతడి కెరీర్‌లోనే బెస్ట్ : కోలీవుడ్ స్టార్ హీరో ధనూష్ నటించిన 'కెప్టెన్ మిల్లర్' మూవీకి వీక్షించిన ఇంకో నెటిజన్ X (ట్విట్టర్)లో ఇలా ట్వీట్ చేశారు. ఇందులో 'కెప్టెన్ మిల్లర్ మూవీ ప్రేక్షకులకు ఓ యావరేజ్ సినిమాను చూసిన ఫీల్ కలిగిస్తుంది. జీవీ ప్రకాశ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ లేకపోతే ఇది మరింత ఫ్లాట్ అయిపోయేది. ఇది అతడి కెరీర్‌లోనే బెస్ట్ ఔట్‌పుట్' అని వివరించారు.
సరైన స్క్రిప్ట్‌తో ధనూష్ : ధనూష్ - ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన 'కెప్టెన్ మిల్లర్' చూసిన మరొక నెటిజన్ 'ఒక్క మాటలో చెప్పాలంటే.. దయచేసి అందరూ టికెట్‌లను బుక్ చేసుకోండి. సరైన స్క్రిప్ట్ దొరికితే అద్భుతమైన నటుడు ఎలా చేయగలడో ఈ సినిమాలో చూడండి. ఇది ధనూష్ అభిమానులకు, తమిళ సినీ ప్రియులకు మరుపురాని అనుభవాన్ని ఇస్తుంది' అని పేర్కొన్నారు.
చెత్త అనుభవం అంటూ : 'కెప్టెన్ మిల్లర్' మూవీని చూసిన ఓ నెటిజన్ ట్విట్టర్‌లో ఇలా స్పందించారు. 'కెప్టెన్ మిల్లర్ చూడడం ద్వారా 2024 చెత్త థియేటర్ అనుభవంతో ప్రారంభం అయింది. పేలవమైన కథనం, చాలా సమస్యలను చూపించడానికి ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యారు. కోలీవుడ్‌లో అతిగా అంచనా వేసిన దర్శకుడు.. అతడిని వెట్రిమారన్, రంజిత్‌తో పోల్చవద్దు' అని చెప్పారు.
ఓవరాల్‌గా ఊహించనిది : ధనూష్ నటించిన 'కెప్టెన్ మిల్లర్' మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ కనిపించిన ట్వీట్స్ అన్నీ మిక్స్‌డ్‌గానే ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా చాలా మంది ఈ సినిమాను ఏవరేజ్ అని చెప్తుండగా.. కొందరు మాత్రం బాగుందని అంటున్నారు. మరి రాను రానూ టాక్ ఏమైనా మారుతుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే ధనూష్‌కు షాక్ తప్పదు.


Click it and Unblock the Notifications











