ఆ హీరో సైకోనే...
తమిళంలో స్టార్ గా వెలుగుతున్న ధనుష్ ఈ మధ్యన తన అన్న సెల్వరాఘవన్ డైరక్ట్ చేసిన చిత్రం ఆడియో పంక్షన్ కి అటెండయ్యాడు. అక్కడ స్టేజీపై మాట్లాడుతూ మా అన్నయ్య ఎందుకునో నాకన్నీ సైకో పాత్రలు ఇస్తున్నాడు. కాదల్ కొండన్, పుదుప్పేటై చిత్రాలు ఇస్తాడు కానీ రొమాంటిక్ స్టోరీస్ లో హీరోగా ఇవ్వడు..చక్కగా బృందావన కాలనీ వంటి సినిమాల్లో హీరోగా ఇవ్వచ్చుగా అన్నాడు నవ్వుతూ..దానికి సమాధానంగా సెల్వ రాఘవన్ కూల్ గా అదేంటో నిన్ను చూస్తే అన్నీ సైకో పాత్రలే వస్తాయి..రొమాంటిక్ స్టోరీస్ పుట్టవు అన్నాడు. దాంతో ధనుష్ అభిమానులు సైతం టప్పట్లు కొట్టారు. సెల్వ రాఘవన్ తెలుగులో వెంకటేష్ తో ఆడువారి మాటలకు అర్దాలే వేరులే చిత్రం చేసారు. మళ్ళీ వెంకీతో తెలుగులో చేసే అవకాశం ఉంది.
dhanush psycho tamil star selva raghavan kadal konden romantic stories తమిళం సెల్వరాఘవన్ ఆడియో పంక్షన్ బృందావన కాలనీ సైకో పాత్రలు కాదల్ కొండన్


Click it and Unblock the Notifications