»   »  ధనుష్ "పుట్టుక" కేసు మరింత సీరియస్ అయ్యింది : ఇవే అనుమానాలు

ధనుష్ "పుట్టుక" కేసు మరింత సీరియస్ అయ్యింది : ఇవే అనుమానాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ధనుష్ పెళ్లి సమయంలో ఓ వ్యక్తి ఈ హీరో తమ కొడుకని, మాకు అప్పగించాలని అప్పట్లో కలకలం రేపిన విషయం తెలిసిందే.దీనిపై అప్పుడు ధనుష్ ఫాదర్, డైరెక్టర్ కస్తూరిరాజా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసి ఆ వివాదాన్ని పక్కకు జరిపారు. అయితే తర్వాత తర్వాత ఆ గొడవ సద్దుమణిగింది. అయితే అలా అనుకున్నారు. తాజాగా మళ్ళీ అదే వివాదం తెర మీదకొచ్చింది.

మదురై జిల్లా మేలూర్‌ గ్రామానికి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు మదురై కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను, వాళ్లు కోర్టులు అందజేసిన పత్రాలను జస్టిస్ జి.చోక్కాలింగం పరిశీలించారు.ఈ నేపథ్యంలో ఈ కేసు రద్దు చేయాలని కోరుతూ నటుడు ధనుష్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఈ నెల 28 లోగా కోర్టుకు:

ఈ నెల 28 లోగా కోర్టుకు:

ఈ కేసును విచారించిన కోర్టు పలుమార్లు విచారించింది. తాజాగా స్కూల్ సర్టిఫికెట్లను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఆ మేరకు సర్టిఫికెట్ కాపీలను ధనుష్ న్యాయవాది ఇటీవల కోర్టుకు సమర్పించారు. అయితే బర్త్ మార్క్స్ (పుట్టుమచ్చలు) వెరిఫికేషన్ కోరకు ఈ నెల 28 లోగా కోర్టుకు హాజరు కావాలని మదురై కోర్టు సూచించింది.

ప్రయివేట్ బస్ కండక్టర్:

ప్రయివేట్ బస్ కండక్టర్:

మధురై జిల్లాలోని మలంపట్టి గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రయివేట్ బస్ కండక్టర్ అయిన కదిరేశన్ (60) - మీనాళ్ (55) దంపతులు మేలూరు మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేశారు. ఈ దంపతులే హీరో ధనుష్ తమ కొడుకని, తన అసలు పేరు కలై సెల్వన్ అని, పదో తరగతి వరకు మేలూరులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడని చెబుతున్నారు.

వెతకవద్దని లేఖ:

వెతకవద్దని లేఖ:

అంతేకాకుండా ధనుష్ ఇంటర్ అడ్మిషన్ శివగంగలో తీసుకున్నామని,అతని అసలు పేరు కలైసెల్వన్‌ కాగా చిన్నప్పుడు చదువుకోలేదని మందలించడంతో సినిమాల్లో నటించడానికి చెన్నై వెళుతున్నానని, తన కోసం వెతకవద్దని లేఖ రాసి వెళ్లిపోయాడని అందులో పేర్కొన్నారు.

2002లో ఉద్యోగం కోసం:

2002లో ఉద్యోగం కోసం:

హీరో ధనుష్‌ చెన్నైలోని పాఠశాలలో చదువుకున్న ఆధారాలను, ఆయన పదవ తరగతి పరీక్షలు రాసిన పత్రాలను.. 2002లో ఉద్యోగం కోసం ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో తన పేరును నమోదు చేసినట్లు ఆ దంపతులు కోర్టుకు సమర్పించారు. ధనుష్ తరపు న్యాయవాది సమర్పించిన ఆధారాల ప్రకారం

ఐడెంటిటీ మార్క్స్:

ఐడెంటిటీ మార్క్స్:

ధనుష్‌ నటించిన తొలి చిత్రం తుళ్లువదో ఇళమై 2002 మార్చి నెలలో సెన్సార్‌ పూర్తి చేసుకుని మే నెలలో విడుదలయ్యింది. అయితే అయితే ధనుష్ కోర్టుకు అందజేసిన టెన్త్ క్లాస్ టీసీ లో ఐడెంటిటీ మార్క్స్ పేర్కొనలేదు. మరోవైపు కదిరేశన్, మీనాక్షి దంపతులు కోర్టుకు ఇచ్చిన టీసీలో పుట్టుమచ్చల వివరాలు ఉన్నాయి. దీంతో వెరిఫికేషన్ కోసం ధనుష్ ను నేరుగా కోర్టులో హాజరుకావాలని మధురై బెంచ్ ఆదేశించింది.

ఆధారాలు ఉన్నాయని:

ఆధారాలు ఉన్నాయని:

ఈ కేసుపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగింది. ధనుష్‌ తరపు న్యాయవాది కధిరేశన్‌ దంపతుల ఆరోపణల్లో నిజం లేదనీ, అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కదిరేశన్‌ దంపతులు కోర్టుకు విన్నవించుకున్న నేపథ్యంలో ధనుష్‌ తరపున కొన్ని ఆధారాలను ఇరు వర్గాలు కోర్టుకు సమర్పించారు.

 ధనుష్ కోర్టుకు హాజరు కావాలని:

ధనుష్ కోర్టుకు హాజరు కావాలని:

కధిరేశన్ దంపతులు కోర్టులో ప్రవేశపెట్టిన టీసీలో పుట్టు మచ్చలు పేర్కొన్నట్లు ఉండగా, ధనుష్ తరఫు లాయర్ సమర్పించిన టీసీలో పుట్టు మచ్చలు పేర్కొనలేక పోవడం గమనార్హం. దీంతో ధనుష్ కోర్టుకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు అందజేసింది.

 ధనుష్ చిన్న నాటి ఫోటో:

ధనుష్ చిన్న నాటి ఫోటో:

ఇదంతా చూస్తూంటే ఇప్పుడప్పుడే ముగిసేలాలేదు. అంత బలంగా ఎలా ఎచెప్పగలుగుతున్నారు అన్న అనుమానాలూ కలుగుతున్నాయ్. మరీ ఇంటర్ తర్వాత ఇంటినుంచి వెళ్ళిపోయాడన్న మాట కదిరేషన్ దంపతులు చెబుతున్నారు, ధనుష్ ని చిన్న తనం నుచీ కస్తూరిరాజా ఇంట్లో ధనుష్ ని చూసిన వాళ్ళు ఎవరూ నోరు విప్పకపోవటం, కస్తూరి రాజా ఫ్యామిలీతో ధనుష్ చిన్న నాటి ఫోటోలని విడుదల చేయకపోవటం వల్ల కూడా కోలీవుడ్ లో అనుమానాలు రేకెత్తుతున్నాయ్.

English summary
Counsel submitted Dhanush’s Class X education certificates and a transfer certificate establishing that he studied in Chennai
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu