'బృందావనం' తమిళ రైట్స్ కోసం ఆ హీరోలిద్దరూ ఫైట్
జూ ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి రూపొందించిన "బృందావనం" చిత్రం విజయం సాధించటంతో తమిళ రైట్స్ కి మంచి పోటీ ఏర్పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్, ధనుష్ ఈ చిత్రం చేయాలని ఇప్పటికే స్పెషల్ స్క్రీనింగ్ చూసి తమ నిర్మాతలను ఎలర్ట్ చేసినట్లు చెప్తున్నారు. ఇక విజయ్ అయితే ఇప్పటికే దిల్ రాజుతో రైట్స్ విషయంపై డిస్కషన్ చేసినట్లు వినికిడి. ఇద్దరు హీరోయిన్స్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఓ మాస్ హీరో చేయటం వారిని బాగా ఆకర్షిస్తోంది. మరో ప్రక్క బొమ్మరిల్లు చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసి హిట్టు కొట్టిన ఎడిటర్ మోహన్ కూడా ఈ చిత్రం రైట్స్ ఎంక్వైరీ చేస్తున్నట్లు సమాచారం.
More from Filmibeat
ధనుష్ విజయ్ జూ ఎన్టీఆర్ బృందావనం దిల్ రాజు కాజల్ సమంత dhanush vijay jr ntr brindavanam dil raju kajal samantha


Click it and Unblock the Notifications











