100 కోట్లతో ధనుష్ భారీ బడ్జెట్ మూవీ.. షారుక్ డైరెక్టర్‌తో బాలీవుడ్ చిత్రం.. హాలీవుడ్ సినిమా రెడీ!

By Rajababu

Recommended Video

Dhanush To Start A High Budget Movie

తమిళ, ఆంగ్ల చిత్రాలపై దృష్టిపెడుతున్న హీరో ధనుష్ వరుస విజయాలు, సక్సెస్‌లతో దూసుకెళ్లున్నారు. గతంలో పవర్ పాండీ చిత్రానికి దర్శకత్వం వహించిన ధనుష్ మరో చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ చిత్రం ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లునున్నది. అలాగే బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ధనుష్ వెల్లడించారు.

వరుస సినిమాలతో

వరుస సినిమాలతో

ఓ వైపు నిర్మాతగా కాలా చిత్రాన్ని తెరకెక్కిస్తూనే ధనుష్ తాను నటించే చిత్రాలతో బిజీగా మారారు. హాలీవుడ్‌లో ది ఎక్ట్స్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఇటీవల కేన్స్‌లో ఆవిష్కరించారు. అలాగే దర్శకుడు వెట్రిమారన్‌తో తీసిన వడా చెన్నౌై చిత్రాన్ని రిలీజ్ చేసే ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. అలాగే మారి2 సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేందుకు కష్టపడుతున్నారు.

ఆనంద్ ఎల్ రాయ్ షారుక్‌తో

ఆనంద్ ఎల్ రాయ్ షారుక్‌తో

అలాగే బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ షారుక్‌ ఖాన్‌తో జీరో అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జీరో సినిమా పూర్తి కాగానే తన సినిమా ప్రారంభమవుతుందని ధనుష్ వెల్లడించారు. ప్రస్తుతం ఆనంద్‌తో సినిమా ప్రీ ప్రొడక్షన్ స్థాయిలో ఉందని చెప్పారు.

తెరపైకి వీఐపీ3

తెరపైకి వీఐపీ3

వీఐపీ3 చిత్రంపై కూడా కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తాను. వీఐపీ2 చిత్రం మంచి లాభాలను సంపాదించిపెట్టింది. కొన్ని ఐడియాలపై చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తిస్థాయి స్క్రిప్టు పూర్తవుతుంది అని ధనుష్ పేర్కొన్నారు.

డైరెక్టర్‌గా రెండో సినిమా

డైరెక్టర్‌గా రెండో సినిమా

ధనుష్ తాను దర్శకత్వం వహించే రెండో చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టులో ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్తుంది. పవర్ పాండీ మాదిరిగా కాకుండా భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని రూపొందిస్తాం. 100 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా సినిమాను రూపొందిస్తాం. తమిళ, మలయాళ, తెలుగులోనే కాకుండా అంతర్జాతీయ ప్రాజెక్ట్‌గా రూపొందించేందుకు ప్లాన్ రెడీ అవుతున్నది అని తెలిపారు.

జూన్ 7న కాలా రిలీజ్

జూన్ 7న కాలా రిలీజ్

ధనుష్ నిర్మాతగా మారి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో రూపొందించిన కాలా చిత్రం జూన్‌ 7న విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. గ్యాంగ్‌స్టర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X