Don't Miss!
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్‌పై వేటు.. గుజరాత్‌తో తలపడే సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!!
మావి కాపీ కొట్టి మాకే..
సూపర్ హిట్ రెడీ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్ అవుతోంది. అక్కడ స్టార్ హీరో ధనుష్ ఈ చిత్రంలో హీరోగా చేయటానికి ఈ చిత్రం చేయటానికి కమిట్ అయ్యారు. బాలాజి స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం రీమేక్ రైట్స్ కి చాలా పోటీ జరిగింది.అలాగే తమిళంలోనూ జెనీలియానే హీరోయిన్ గా అడిగే ఛాన్స్ లున్నట్లు సమాచారం. ఇక బ్రహ్మానందం చేసిన మెక్ డొనాల్ మూర్తి పాత్రను వడివేలు పోషించే అవకాశం ఉందని నిర్మాతలు చెప్తున్నారు. తమిళ నేటివిటీకి తగ్గట్లు కొన్ని సన్నివేశాలు మారుస్తున్నామని చెప్తున్నారు. అయితే నేటివిటికోసం సీన్స్ మార్చటం కాదని కొన్ని సన్నివేశాలు మాధవన్ తమిళ చిత్రం ఎదిరిలోంచి, అలాగే ప్రేమిస్తే హీరో భరత్ చిత్రంలోంచి కొన్ని సన్నివేశాలు పస్టాఫ్ లో తీసుకున్నారని వాటిని మార్చాల్సి వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే అవి అక్కడ రిపీట్ అయితే ఆ సినిమాల నుంచి కాపీ కొట్టి తమ సినిమా తీసారంటారని భయం అని చెప్తున్నారు. తమిళంకు రీమేక్ రైట్స్ తీసుకున్న చాలా మందికి ఇటువంటి సమస్యలు వస్తున్నాయని వినపడుతోంది. మనవాళ్ళు చాలామంది చాలా సన్నివేశాలకు తమిళ సినిమాలపై ఆధారపడినంత కాలం ఈ సమస్యలు తప్పదంటున్నారు.