twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విషాదం: 29 ఏళ్లకే మరణించిన యువ దర్శకుడు

    తమిళ దర్శకుడు కన్నన్ రామస్వామి గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 29 సంవత్సరాలు.తమిళ చిత్రం ధాయం ద్వారా ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు.

    By Bojja Kumar
    |

    తమిళసినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. 29 ఏళ్ల వయసులోనే యువ దర్శకుడు కన్నన్ రంగస్వామి మరణించడం అందరినీ కలిచి వేసింది. తమిళ మూవీ 'ధాయం' సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన రంగ స్వామి ఆదివారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గత నెలలోనే రంగస్వామి తన 29న పుట్టినరోజు వేడుక జరుపుకున్నాడు.

    గుండెపోటు రావడంతో కన్నన్ రామస్వామి సెప్టెంబర్ 23న ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. తర్వాత అతడిని పాండిచ్చేరిలోని జిప్మెర్ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 15 రోజుల నుండి కన్నన్ కోమాలో ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 29న ఉదయం 9 గంటలకు కన్నన్ మళ్లీ గుండె పోటుకు గురికావడంతో మరణించారు.

    Dhayam director Kannan Rangaswamy dies at 29

    కన్నన్ రామస్వామి దర్శకత్వం వహించిన 'ధాయం' మూవీ ఈ సంవత్సరం మొదట్లో విడుదలైంది. ఒకే రూములో థ్రిల్లర్ కాన్సెప్టుతో తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతో మందిలో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది.

    న్యూయార్క్‌లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసిన కన్నన్ రామస్వామి.... ఆ తర్వాత నేరుగా, ఎవరి వద్ద అసిస్టెంటుగా చేయకుండానే దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఇంత చిన్న వయసులోనే కన్నన్ మరణించడంపై తమిళ సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Kannan Rangaswamy (29) the director of the movie Dhayam, which was entirely shot inside one room, passed away recently much to the shock of everyone. The young director suffered his first heart attack and was hospitalised for about 40 days, according to reports.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X