For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని షాక్: అసలెందుకిలా ఆమెని వెళ్ళగొట్టారు?

    |

    దించక్ పూజా ఈ మధ్యకాలం లో యూట్యూబ్ పాప్ స్టార్ గా వెలుగొందాలనుకొని పాపం కామెడీ స్టార్ గా మాత్రమే పేరు తెచ్చుకుంది పూజ. పాపం ఈవిడ పాటలు కాస్త ఇరిటేటింగ్ గా ఉండటం తో చాలా వ్యతిరేకతే వచ్చింది. కంప్లైంట్లు కూడా రావటం తో ఆమె చానెల్ ని బ్లాక్ చేసింది యూట్యూబ్. అయితే ఈ కాంట్రవర్సి డించక్ పూజ కి ఇంకో కొత్త క్రేజ్ తెచ్చింది ఊహించని విధంగా స్టార్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్ద్ ఎంట్రీ ద్వారా అడుగు పెట్టింది. అయితే పాపం రెండు వారాలకు మించి అక్కడ ఉండలేక పోయింది.

    ఢించ‌క్ పూజ ఎలిమినేట్

    ఢించ‌క్ పూజ ఎలిమినేట్

    రెండు వారాల క్రితం వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఢించ‌క్ పూజ ఎలిమినేట్ అయిన‌ట్లు ఆదివారం రాత్రి స‌ల్మాన్ ఖాన్ ప్ర‌క‌టించ‌గానే చాలా మంది కంగుతిన్నారు. భారీ అంచ‌నాల మ‌ధ్య అడుగుపెట్టిన ఢించ‌క్, ఇంత త్వ‌ర‌గా బిగ్‌బాస్ ఇంటి నుంచి వెళ్లిపోతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. తాను కూడా అస్స‌లు ఊహించ‌లేద‌ని యూట్యూబ్ స్టార్ తెలిపింది.

    ఊహించ‌ని ప‌రిణామ‌మే.

    ఊహించ‌ని ప‌రిణామ‌మే.

    హితేన్ తేజ్వాని, ప్రియాంక్ శ‌ర్మ‌, స‌ప్నా చౌద‌రి, శిల్పా షిండే, హీనా ఖాన్, బెనాఫ్షా సూన‌వాలా, స‌బ్య‌సాచి స‌త్ప‌తి, బంద్గీ ఖ‌ల్రాల‌తో క‌లిపి పూజ కూడా ఎలిమినేష‌న్‌కి నామినేట్ అయింది. అయితే వీరంద‌రిలోనూ పూజ ఎలిమినేట్ అవ‌డం ఓ ర‌కంగా ఊహించ‌ని ప‌రిణామ‌మే.

    కంటెస్టంట్లు తన‌న్ను టార్గెట్ చేశార‌ు

    కంటెస్టంట్లు తన‌న్ను టార్గెట్ చేశార‌ు

    ఇలా ఎలిమినేట్ అవ‌డం కూడా ఓ రకంగా మంచే జ‌రిగింద‌ని పూజ అంది. తాను బిగ్‌బాస్ ఇంట్లోకి ప్ర‌వేశించిన‌ప్ప‌టి నుంచి ఇత‌ర కంటెస్టంట్లు త‌న‌ను టార్గెట్ చేశార‌ని, అర్షి ఖాన్‌, ఆకాశ్ ద‌డ్లానీ మిన‌హా మిగ‌తా కంటెస్టంట్లు ఎవ‌రూ త‌న‌తో క‌లిసేందుకు పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌లేద‌ని పూజ తెలిపింది.

    అర్షి ఖాన్‌ను కాపాడ‌టం కోసం

    అర్షి ఖాన్‌ను కాపాడ‌టం కోసం

    అందుకే అర్షి ఖాన్‌ను కాపాడ‌టం కోసం గ‌త‌వారం త‌న‌ను తాను నామినేట్ చేసుకున్న‌ట్లు పూజ వెల్ల‌డించింది. ఇంట్లో ఎవ‌రికి త‌గ్గ‌ట్లుగా వారు గేమ్ ఆడుతున్నార‌ని, హీనా ఖాన్‌, హితేన్ తేజ్వాని, శిల్పా షిండే, ప్రియాంక్ శ‌ర్మ‌లు సందర్భానికి త‌గ్గ‌ట్లుగా తెలివిగా ఆడుతున్నార‌ని చెప్పింది. బిగ్‌బాస్ ఇంట్లో తాను పాడిన పాట‌ను ఆద‌రించినందుకు అంద‌రికీ పూజ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది.

    English summary
    It indeed came as a shocker when host Salman Khan on Sunday announced that young star Dhinchak Pooja aka Pooja Jain has been evicted from the Bigg Boss 11 house.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X