ఉత్కంఠ రేపుతున్న 'ధృవ నక్షత్రం' టీజర్.. బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న విక్రమ్!
చియాన్ విక్రమ్ తన అభిమానులకు ఊపిరితీసుకునే సమయం కూడా ఇవ్వడంలేదు. ఇటీవలే విడుదలైన సామి స్క్వేర్ టీజర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. ఆ టీజర్ ని ఆస్వాదించకముందే విక్రమ్ మరో టీజర్ తో మన ముందుకు వచ్చాడు. ధృవ నక్షత్రం టీజర్ ని నేడు విడుదల చేశారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
విక్రమ్ మునుపెన్నడూ కనిపించని విధంగా ఈ టీజర్ లో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. విక్రమ్ గూఢచారిగా నటిస్తున్న ఈ చిత్రం థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది. టీజర్ లో చూపిన విజువల్స్, స్టంట్స్ అద్భుతంగా ఉన్నాయి.

నటీనటులు తుపాకులతో చేసే పోరాట సన్నివేశాలు ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. యూరప్ లోని పలు ప్రాంతాల్లో భారీ ఖర్చుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గౌతమ్ మీనన్ చిత్రాలు స్టైలిష్ గా ఉంటాయి. అదే తరహాలో ఈ చిత్రం కూడా ఉన్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టుల్లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











