twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాక్టింగ్, స్క్రిప్ట్, డైలాగ్స్...కమల్ హాసన్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ నటుడు కమల్ హాసన్ త్వరలో ‘ఉత్తమ విలన్' అనే తమిళ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈచిత్రం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ నటనకే పరిమితం కాకుండా...స్క్రిప్టు వర్క్, డైలాగ్స్ కూడా రాసారట. ఈ చిత్ర దర్శకుడు రమేష్ అరవింద్ ఈ విషయాలను తెలియజేసారు.

    ఈ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఉత్తమన్ అనే పాత్ర 8వ శతాబ్దానికి చెందిన డ్రామా యాక్టర్. మనోరంజన్ అనే పాత్ర 21 శతాబ్దానికి చెందిన సినిమా సూపర్ స్టార్ పాత్ర. ఈ రెండు పాత్రలను తనదైన రీతిలో కమల్ హాసన్ రక్తి కట్టించాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. కమల్‌తో కలిసి దక్షిణాదికే చెందిన మరో నలుగురు అగ్ర హీరోలు కూడా ఇందులో కనిపించనున్నారని సమాచారం.

    Dialogues in Uttama Villain penned by Kamal Haasan

    ఈ చిత్రంలో కమల్ హాసన్ పోషిస్తున్న మనోరంజన్ పాత్రకు భార్యగా ఊర్వశి నటిస్తోంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.విశ్వనాథ్ మనోరంజన్ మామ పాత్రను పోషిస్తున్నారు. హీరోయిన్ ఆండ్రియా మనోరంజన్ ప్రియురాలి పాత్రలో కనిపించబోతోంది. సినిమాలో మనోరంజన్ పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు.

    8వ శతాబ్దం బ్యాక్ డ్రాపులో నడిచే కథలో... నాజర్, ముత్తరాజన్, జయరాం, పార్వతి మెల్టన్, ఎంఎస్ భాస్కర్ కనిపించనున్నారు. మొత్తానికి ఈచిత్రం కమల్ హాసన్ నుండి వస్తున్న మరొక వైవిద్యమైన చిత్రం. ఉత్తమ విలన్ చిత్రానికి కన్నడ యాక్టర్, డైరెక్టర్ రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్, ఎన్ లింగుస్వామికి చెందిన తిరుపతి బ్రదర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఎం ఘిబ్రన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్యాం దత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కమల్ హాసన్‌తో కలిసి సహజీవనం చేస్తున్న గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తోంది.

    English summary
    Actor-filmmaker Ramesh Arvind, who is busy with the post-production work of upcoming Tamil directorial “Uttama Villain”, says the film’s dialogues were written by superstar Kamal Haasan, and not by writer Crazy Mohan as being speculated.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X