Srikanth: శ్రీకాంత్ భార్య కూడా జైలుకెళ్లిందా? ఏ నేరంలో అంటే?
తమిళ హీరో శ్రీకాంత్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో మరోసారి చిత్ర పరిశ్రమలో కలకలం రేగింది. తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నేత నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినవారు ఇచ్చిన సమాచారం ఆధారంగా శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను నుంగంబాక్కం పీఎస్‌కు తరలించారు. ఆపై నిర్వహించిన వైద్య పరీక్షల్లో శ్రీరామ్‌కు పాజిటివ్‌గా తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌లో సెటిల్
శ్రీకాంత్ తెలుగువాడే.. తమిళ చిత్రం రోజా కూటంతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. దీనినే రోజాపూలు పేరుతో రీమేక్ చేయగా మంచి ఆదరణ దక్కింది. ఈ సినిమా హిట్ సాధించడంతో తెలుగులో వరుసపెట్టి అవకాశాలు దక్కించుకున్నాడు. ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, దడ, నిప్పు, లై, శ్రీనివాస కళ్యాణం, రాగల 24 గంటల్లో, రావణాసుర, టెన్త్ క్లాస్ డైరీస్ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వెబ్ సిరీస్‌ల హవా మొదలయ్యాక శ్రీకాంత్ బాగా బిజీ అయ్యారు. హరికథ, రెక్కీ వంటి సిరీస్‌లు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి.

బార్‌లో గొడవతో కదిలిన డ్రగ్స్ డొంక
ఇక 2008లో వందన అనే అమ్మాయిని శ్రీకాంత్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె అహానా, కుమారుడు అహిల్. ఇటీవల మద్రాస్‌లోని ఓ బార్‌లో ఓ రాజకీయ నేత తప్పతాగి గొడవకు దిగాడు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అతనిని విచారించగా డ్రగ్స్ డొంక కదిలింది. హీరో శ్రీకాంత్ కోసం ప్రదీప్ అనే వ్యక్తి తన దగ్గర కొకైన్ కొన్నాడని.. అతను గతంలోనూ పదుల సంఖ్యలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు చెప్పడంతో పోలీసులు యాక్షన్‌లోకి దిగారు. ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా శ్రీరామ్‌ను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. అతని శాంపిల్స్‌ను పరీక్షించగా పాజిటివ్‌గా తేలినట్లు వార్తలు వచ్చాయి.
శ్రీకాంత్‌కు రిమాండ్
దాదాపు 8 గంటల పాటు హీరోను విచారించిన పోలీసులు అనంతరం ఆయనను చెన్నై కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి.. శ్రీరామ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ప్రస్తుతం హీరో వ్యవహారం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు.. ప్రదీప్ ఇంకా ఎవరెవరు ప్రముఖులకు డ్రగ్స్ విక్రయించాడో కూపీ లాగే పనిలో పోలీసులు ఉన్నారు. విచారణలో మరికొందరు పెద్ద తలకాయల పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
పెళ్లి విషయం దాచిన శ్రీకాంత్
ఇదిలాఉండగా.. హీరో శ్రీకాంత్ వైవాహిక జీవితం కూడా సమస్యల్లో ఉన్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. 2007లోనే శ్రీకాంత్ - వందనల పెళ్లి జరగ్గా ఆయన కొన్నాళ్లు ఈ విషయాన్ని దాచిపెట్టారట. వీరిద్దరి ప్రేమను శ్రీకాంత్ తల్లిదండ్రులు అంగీకరించడంతో పెళ్లి నిశ్చయించారు. ఈ దశలో వందన, ఆమె తల్లిదండ్రుల నేర చరిత్ర బయటపడింది. వారిపై భూ వివాదంలో కేసులు ఉన్నాయని, జైలుకు కూడా వెళ్లిచ్చినట్లు తెలియడంతో ఈ పెళ్లిని రద్దు చేసుకున్నారు. అయితే శ్రీకాంత్ మాత్రం తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా వందనను పెళ్లాడారు.
వందనపై క్రిమినల్ కేసులు
వందనతో పెళ్లిని రద్దు చేసుకోవాలని అనుకున్నప్పుడు తన జీవితం మలుపు తిరిగిందని శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన తల్లిదండ్రులను ఒప్పించగలననే నమ్మకంతోనే రిజిస్టర్ వివాహం చేసుకున్నానని వెల్లడించారు. అధికారికంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు.. వందన ఓ నేరానికి జైలు శిక్ష అనుభవించడంతో పాటు పలు క్రిమినల్ కేసులు ఆమెపై ఉన్నాయని, పాస్‌పోర్టులు కూడా జప్తు చేశారని తెలిసిందన్నారు. తన అనుచరులతో కలిసి వందన ఓ రోజున తమ ఇంటికి వచ్చి నా తల్లిదండ్రులను బెదిరించిందని.. దాంతో తాను ఇంటి నుంచి పారిపోయి పోలీసులను ఆశ్రయించానని శ్రీకాంత్ చెప్పారు. అయితే కౌన్సెలింగ్, చట్టపరమైన జోక్యం తర్వాత వందన - శ్రీకాంత్‌లు తమ వివాహ బంధాన్ని కొనసాగించారు. ప్రస్తుతం శ్రీకాంత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











