»   » నేనేమీ బలవంతం పెట్టి పెళ్లి చేసుకోలేదు, హీరోయిన్ భర్త మీడియాతో...

నేనేమీ బలవంతం పెట్టి పెళ్లి చేసుకోలేదు, హీరోయిన్ భర్త మీడియాతో...

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    చెన్నై:తమిళ డబ్బింగ్ చిత్రం 'బిచ్చగాడు' సినిమా ద్వారా పాపులర్‌ అయిన హీరోయిన్‌ సాట్నా టైటస్‌. ఆమె రీసెంట్ గా లవ్ మ్యారేజ్ చేసుకుని మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అందుకు కారణం ఆమె తల్లికి ఇష్టం లేని పెళ్లి చేసుకోవటం మాత్రమే కాదు..ఆమె వివాహం చేసుకున్న వ్యక్తి ఓ డిస్ట్ర్రిబ్యూటర్ కూడా కావటం. ఈ నేఫధ్యంలో తన కూతురుని మాయ చేసి బుట్టలో పడేసి పెళ్లి చేసుకున్నాడంటూ నడిగర సంఘంలో ఆమె తల్లి కంప్లైంట్ చేసింది. ఈ విషయమై సాట్నాను వివాహం చేసుకున్న కార్తీక్ మీడియాతో మాట్లాడాడు.

    కార్తీ మాట్లాడుతూ...తాను ఎప్పుడూ సాట్నా ను వివాహ విషయమై బలవతం చేయలేదన్నారు. మేము కొంతకాలం ప్రేమించుకుని తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అయితే మా తల్లి, తండ్రులు ఈ వివాహానికి అభ్యంతరం చెప్పారు కాబట్టి మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. మేము మేము మరికద్ది రోజుల్లో అంటే వచ్చే సంవత్సరం ప్రారంభంలో గ్రాండ్ గా అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటాం అన్నారు.

    అయితే సాట్నా తల్లి ఓ తమిళ పత్రిక తో మాట్లాడుతూ...కార్తీ తన కుమార్తెను వివాహం చేసుకోమంటూ బలవతం చేసాడని ఆరోపించింది. ఈ విషయమై కార్తీ విభేధించాడు. మేము ఒకరినొకరు ఇష్టపడే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఆమెను బలవంతం చేసి పెళ్లిచేసుకోవాల్సిన అవసరం లేదు. మేము త్వరలోనే మా తల్లి,తండ్రులను ఒప్పించి, వారి ఆశీస్సులు తీసుకుంటాము. కార్తీ..కెరీ ఫిల్మ్ లో ఓ భాగస్వామి. కెఆర్ ఫిల్మ్స్ వారే తమిళనాడులో పిచ్చైకారన్ (బిచ్చగాడు)ని రిలీజ్ చేసారు.

    Didn't Force Satna Into Marriage: Karthik

    ఇక 'బిచ్చగాడు' ఒరిజనల్‌ అయిన తమిళ 'పిచ్చైక్కారన్‌' సినిమానే హీరోయిన్‌గా సాట్నాకు తొలిసినిమా. ఈ చిత్ర విజయంతో ఆమెకు తమిళంలో మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో కొంతమంది నిర్మాతల వద్ద అడ్వాన్స్‌ కూడా తీసుకుందట సాట్నా. అయితే ఇప్పుడు ఆమె గురించి ఓ సంచలన విషయం బయటపడటంతో అంతా కామ్ అయ్యిపోయారు.

    ఆమె 'పిచ్చైక్కారన్‌' చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేసిన బయ్యర్‌ కార్తీని నెల రోజుల కిందటే వివాహమాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నెల రోజుల ముందే ఈ జంట రిజిస్టర్‌ మ్యారేజ్‌ ద్వారా ఒక్కటైందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈమె గతంలో ఒప్పుకున్న చిత్రాల నిర్మాతలు ఈమెకిచ్చిన అడ్వాన్స్‌లను వెనక్కు తీసేసుకున్నారట. అయితే ఇప్పటికే సగం షూటింగ్‌ పూర్తయిన 'సంగదేవన్‌' చిత్ర పరిస్థితి అయోమయంలో పడింది.

    ఇకపోతే, సాట్నా తల్లి ఈ వివాహంపై పోలీసులను ఆశ్రయించింది. సాట్నాను కార్తీ మాయలో పడేశాడని, అతని నుంచి సాట్నాను విడిపించాలని ఆమె పోలీసులను కోరింది. కాగా, ఇరు కుటంబాల సమ్మతితోనే తమ వివాహం జరిగిందని, మరోసారి బహిరంగ వివాహం చేసుకుంటామని కార్తీ చెప్పడం గమనార్హం. పెళ్లి తర్వాత సాట్నా నటనకు స్వస్తి చెప్పనుందన్న విషయం కూడా కార్తీ తెలిపారు.

    English summary
    Film producer and distributor Karthik has said that he didn't force actress Satna Titus into marrying him. Satna, who made her Tamil acting debut with Vijay Antony's Pichaikkaran earlier this year, and Karthik registered their marriage in a hush-hush manner.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more