»   » షాకింగ్.. దిలీప్ ముందే పెళ్లైందట.. మంజు వారియర్ సెకండ్ హ్యాండ్!

షాకింగ్.. దిలీప్ ముందే పెళ్లైందట.. మంజు వారియర్ సెకండ్ హ్యాండ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  మలయాళ నటి లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన నటుడు దిలీప్ ‌గురించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నటి మంజు వారియర్ ఆయనకు మొదటి భర్త కాదనే వార్త మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపుతున్నది. మంజు వారియర్ కంటే ముందే దిలీప్‌కు మరో వ్యక్తితో వివాహం జరిగిందని మలయాళ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో దిలీప్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. గత ఫిబ్రవరిలో పల్సర్ సునీతో కూడిన ఆరుగురు సభ్యుల బృందం నటిపై లైంగికదాడికి ప్రయత్నించారు. ప్రస్తుతం నటిపై లైంగిక దాడి కేసులో దిలీప్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

  లైంగిక దాడి కేసులో కొత్త మలుపు

  లైంగిక దాడి కేసులో కొత్త మలుపు

  మలయాళ నటి లైంగిక దాడి కేసులో గురించి విచారిస్తుండగా దిలీప్ మొదటి పెళ్లి పోలీసుల దృష్టికి వచ్చింది. తన దూరపు బంధువును రిజిస్టర్ ఆఫీస్‌లో పెళ్లి చేసుకొన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఈ పెళ్లి 1990లో దిలీప్ సినిమా ఎంట్రీకి ముందే జరిగింది. అయితే మొదటి భార్య నుంచి అధికారికంగా విడాకులు తీసుకోలేదు అని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

  Dileep Arrested In Actress Abduction Case | Filmibeat Telugu
  మొదటి భార్య గల్ఫ్‌లో..

  మొదటి భార్య గల్ఫ్‌లో..

  మొదటి భార్యతోనూ దిలీప్‌కు సంబంధాలు ఉన్నాయనేది తాజా సమాచారం. ప్రస్తుతం ఆమె గల్ఫ్‌లో ఉంటున్నట్టు తెలుస్తున్నది. అయితే తన మొదటి భార్యను మీడియాకు దూరంగా ఉంచడంలో దిలీప్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు తెలుస్తున్నది. మొదటి భార్య గురించి పోలీసులు వెల్లడించిన సమాచారం సినీ పరిశ్రమను నివ్వెరపాటుకు గురిచేసింది.

  మంజు వారియర్‌తో రెండో పెళ్లి

  మంజు వారియర్‌తో రెండో పెళ్లి

  చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన తర్వాత దిలీప్ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ క్రమంలో నటి మంజు వారియర్‌ను 1998 అక్టోబర్ 20వ తేదీన వివాహం చేసుకొన్నాడు. పెళ్లి తర్వాత వరుస విజయాలతో దూసుకెళ్లాడు. కొద్ది సమయంలోనే దిలీప్ సూపర్‌స్టార్‌గా మారాడు. సాఫీగా సాగుతున్న దాంపత్య జీవితంలో మరో నటి కావ్య మాధవన్ ప్రవేశించింది.

  కావ్య మాధవన్‌తో అఫైర్

  కావ్య మాధవన్‌తో అఫైర్

  మాలీవుడ్‌లో దిలీప్, కావ్య మాధవన్ జంటగా నిలిచిన చిత్రాలకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. దాంతో వారు నటించిన చిత్రాలు వరుస విజయాలు సాధించాయి. మలయాళ చిత్ర పరిశ్రమలో దిలీప్, కావ్య హాట్ ఫేవరెట్ జంటగా మారారు. వారి మధ్య పరిచయం ప్రేమగా మారి విడిపోలేనంతగా బంధం ఏర్పడింది.

  ఆ కారణంగానే నటిపై లైంగిక దాడి..

  ఆ కారణంగానే నటిపై లైంగిక దాడి..

  మంజు వారియర్‌కు మోసం చేస్తున్నారనే కారణంతో దిలీప్, కావ్యలను లైంగిక దాడికి గురైన నటి హెచ్చరించింది. అంతేకాకుండా మంజుకు వారిద్దరి అఫైర్ గురించి చెప్పింది. దాంతో లైంగిక దాడి గురైన నటిపై దిలీప్, కావ్య ద్వేషం పెంచుకొన్నారు. ఈ నేపథ్యంలో దిలీప్, మంజు మధ్య విభేదాలు పెరిగాయి. దాంతో వారిద్దరూ 2015లో విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత కావ్య మాధవన్‌ను దిలీప్ పెళ్లి చేసుకొన్నారు. తమ అఫైర్‌ను బయటపెట్టిందనే కోపంతో నటిపై లైంగికదాడి చేయించాలని ప్లాన్ చేసినట్టు దిలీప్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇటీవల దిలీప్‌ను అరెస్ట్ చేశారు.

  మంజు వారియర్ సోదరుడి విచారణ

  మంజు వారియర్ సోదరుడి విచారణ

  ఈ కేసులో దిలీప్ బెయిల్‌కు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కేరళ పోలీసులు మంజు వారియర్ సోదరుడు మధు వారియర్‌ను విచారించారు. దిలీప్ వ్యవహారశైలి, ప్రవర్తన గురించి అడిగి తెలుసుకొన్నారు. ఈ విచారణలో పలు అంశాలను మధు వారియర్ పోలీసులకు వెల్లడించినట్టు తెలుస్తున్నది.

  English summary
  In a shocking twist in the Malayalam actress abduction case, it is now being reported that actress Manju Warrier was not Dileep's first wife. According to a report published in Manorama Online, Dileep had married his relative from Aluva before his marriage to Manju Warrier. On Wednesday, Manju Warrier's brother Madhu Warrier was questioned by the Kerala police in the abduction case. Madhu was asked about Dileep's character and his marriage to Manju Warrier.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more