»   »  డైలమాలో 'మర్మయోగి' నిర్మాత

డైలమాలో 'మర్మయోగి' నిర్మాత

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kamal Hassan
కమల్ హాసన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మర్మయోగి ప్రస్తుతం సమస్యలో పడింది. అసలు మొదట ఈ చిత్రం సెప్టెంబర్ లో ప్రారంభం అవుతుందని ప్రకటించారు.తర్వాత రెండు నెలలు ముందుకు జరిపి నవంబర్ పదిహేను కు వాయిదా వేశారు. ఇలా ఎందుకు జరుగుతోంది. అంటే నిర్మాతలదే ప్లాబ్లెమ్ అని తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాతలు రజనీకాంత్ హీరోగా చేసిన కుశేలన్(కథానాయుకుడు) చిత్రాన్ని భారీ మొత్తానికి కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూట్ చేసారు. అయితే ఆ చిత్రం భారీ స్ధాయిలో ఫెయిల్యూర్ కావటంతో మర్మయోగి చిత్రంపై ఆ ప్రభావం పడిందని విశ్లేషకులు అంటున్నారు.

అందులోనూ వారు తాజాగా నార్త్ ఇండియాలో తమ ఆపరేషన్స్ ని క్లోజ్ చేసారు. ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో అంత బడ్జెట్ పెట్టి మర్మయోగి నిర్మిస్తే...సేవ్ కాగలమా అని ఆలోచనలో పడుతున్నారని తెలుస్తోంది. అయితే కమల్ మాత్రం రోజుకొకరు తమ సినిమాలో నటిస్తున్నారని ప్రకటిస్తున్నారు. అందులోనూ వారి అంతర్గత విశ్లేషకులు కమల్ దశావతారం కలెక్షన్స్ ఓవరాల్ గా పరిశీలించి విశ్లేషించి...కొద్దిగానే లాభం కనిపించిందనీ అదీ కమల్ క్రేజ్ తో కాదనీ..తేల్చారుట.

ఈ పరిస్ధితుల్లో సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును టేక్ ఓవర్ చేయనున్నారని చెప్తున్నారు.ఈ విషయాన్ని సన్ నెట్ వర్క్ అధికార ప్రతినిధి హన్స్ రాజ్ సక్సేనా అధికారికంగా ధృవీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయనీ అయితే ఇంకా ఏమీ చెప్పలేని స్ధితిలో ఉన్నామని అన్నారు. ఇక పిరమిడ్ సాయి మీర వారు అయితే ఈ నెలలోనే రామోజి ఫిలిం సిటీలో వేసిన సెట్స్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. కమల్ మాత్రం ఈ విషయాలకు దూరంగానే ఉన్నాడు. చూద్దాం త్వరలోనే ప్రారంభం అయితే నిర్మాతలు ఎవరన్నది తేలిపోతుందికదా.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X