ఆసుపత్రిపాలైన డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్
చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన విజయ్, సమంత హీరో హీరోయిన్లుగా తమిళంలో ‘కత్తి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మురుగదాస్ తీవ్ర అస్వస్తతకు గురైనట్లు సమాచారం. వెంటనే అతన్ని చెన్నైలోని అడయార్ ఆసుపత్రికి తరలించారు. మురుగదాస్ అనారోగ్యానికి గల కారణాలు తెలియరాలేదు. ఏది ఏమైనా ఆయన త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యవంతుడు కావాలని ఆశిద్దాం.

కత్తి సినిమా విషయానికొస్తే......
మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో....విజయ్-సమంత తొలిసారి కలిసి నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. బెంగాళీ నటుడు తోటా రాయ్ చౌదరి కూడా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
‘కత్తి' చిత్రం ఆడియో ఈ నెల 18న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు. గతంలో మురుగదాస్, విజయ్ కాంబినేషన్లో ‘తుపాకి' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈచిత్రం అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ మంచి విజయం సాధించింది. త్వరలో మురుగదాస్ డైరెక్టర్ తెలుగు సినిమా చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు.


Click it and Unblock the Notifications











