సూపర్ స్టార్ ని ఓ పట్టు పట్టమన్న దర్శకుడు..!?
రజనీకాంత్ జీవితాన్ని ఆధారం చేసుకుని ఆయన కుమార్తె సౌందర్య 'సుల్తాన్ ది వారియర్" అనే యానిమేషన్ ఫిల్మ్ ఆరంభించిన విషయం తెలిసిందే. దీనికి సౌందర్యే దర్శకత్వ బాధ్యతలు చేపట్టింది. కానీ మధ్యలో ఆ బాధ్యతను కె యస్ రవికుమార్ కి అప్పగించింది. యానిమేటెడ్ వర్షన్ లో రజనీ బొద్దుగా ఉన్నాడట. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో లైవ్ రజనీ కూడా కనిపిస్తాడు. అందుకని యానిమేటెడ్ రజనీకి మ్యాచింగ్ గా ఉండాలంటే రజనీకాంత్ మరి కాస్త బరువు పెరగాలట. కెయస్ రవికుమార్ ఈ విషయం చెప్పి మీరు ఆహారాన్ని ఓ పట్టు పట్టి బరువు పెరిగితే బాగుంటుందని రజనీతో అన్నాడట. అందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అంగీకరించినట్టు సమాచారం.
రజనీకాంత్ సౌందర్య కెయస్ రవికుమార్ సుల్తాన్ ది వారియర్ rajinikanth soundarya ks ravikumar sulthan the warrior


Click it and Unblock the Notifications