రెండో వివాహం చేసుకున్న అమలా పాల్ మాజీ భర్త, దర్శకుడు విజయ్

అమలా పాల్ మాజీ భర్త, తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ మరో వివాహం చేసుకున్నారు. డాక్టర్ ఆర్ ఐశ్వర్యను ఆయన గురువారం(జులై 11) చెన్నైలో పెళ్లాడారు. పూర్తి ప్రైవేట్ సెర్మనీగా ఈ పెళ్లి వేడుక జరిగింది. వివాహానికి సంబంధించిన ఫోటోలు ఆన్ లైన్ ద్వారా విడుదల చేశారు.

విజయ్ తల్లిదండ్రులు ఎఎల్ అళగప్పన్ దంపతులు నూతన జంటతో కలిసి దిగిన ఫోటోలు ఆన్ లైన్లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు న్యూ కపుల్‌ను విష్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ పెళ్లి వేడుకలో సినీ రంగం నుంచి ఎవరెవరు పాల్గొన్నారు? అనేది తెలియాల్సి ఉంది.

ఐశ్వర్య-విజయ్

ఐశ్వర్య-విజయ్

డాక్టర్ ఐశ్వర్యను పెళ్లాడటం ద్వారా విజయ్ కొత్త జీవితం ప్రారంభించారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. గతంలో(2014) హీరోయిన్ అమలా పాల్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విజయ్.... 2017లో ఆమెతో విడిపోయిన సంగతి తెలిసిందే.

రెండో పెళ్లి విషయం ముందే ప్రకటించిన విజయ్

రెండో పెళ్లి విషయం ముందే ప్రకటించిన విజయ్

తన రెండో పెళ్లి విషయం విజయ్ కొన్ని రోజుల క్రితమే మీడియా వారికి తెలియజేశారు. నాతో జీవితం పంచుకోవడానికి ఒక వ్యక్తి వస్తున్నారు. ఆమె డాక్టర్.ఆర్. ఐశ్వర్య. మాది అరేంజ్డ్ మ్యారేజ్. ఈ వేడుకను పూర్తి ప్రైవేట్ సెర్మనీగా జరుపుకోబోతున్నాం. జులైలో మా వివాహం జరుగబోతోంది. నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతున్న నేపథ్యంలో మీ ఆశీర్వాదం కావాలి.... అంటూ విజయ్ ప్రెస్ స్టేట్మెంట్ విడుదల చేశారు.

అమలా పాల్‌తో ఎంతో కాలం సాగని బంధం

అమలా పాల్‌తో ఎంతో కాలం సాగని బంధం

2011లో ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం (తెలుగులో విక్రమ్ హీరోగా వచ్చిన 'నాన్న') షూటింగులో అమలా పాల్, విజయ్ మధ్య ప్రేమ చిగురించింది. తన తర్వాతి చిత్రం 'తలైవా'(తెలుగులో 'అన్న') చిత్రంలో ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నాడు. 2014లో పెళ్లాడిన ఈ జంట 2017లో విడిపోయారు.

ఎఎల్ విజయ్

ఎఎల్ విజయ్

ఎఎల్ విజయ్ సినిమాల విషయానికొస్తే... ఆయన దర్శకత్వం వహించిన ‘దేవి 2' అనే చిత్రం తెలుగులో ‘అభినేత్రి 2' పేరుతో గత నెలలో విడుదలైంది. ప్రస్తుతం జయలలిత బయోపిక్ చేస్తున్నారు. ఇందులో కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X