ఆ మూవీ రిలీజైతే Pathaan, Jawan రికార్డులు తుక్కు తుక్కు.. నా సినిమాకు జవాన్ కంటే ఎక్కువ కలెక్షన్లు.. అట్లీ
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేస్తున్నది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రతీ చోట కలెక్షన్ల ప్రభంజనాన్ని కొనసాగిస్తున్నది. అయితే జవాన్ సినిమా అనూహ్యమైన విజయం సాధిస్తుండటంతో అట్లీ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ షారుక్ ఖాన్ నటించిన రాబోయే సినిమా కలెక్షన్ల గురించి సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఆ కామెంట్ల వివరాల్లోకి వెళితే..
దీపిక పదుకోన్, నయనతార, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో వచ్చిన జవాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. కేవలం 11 రోజుల్లోనే ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తూ 1000 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతున్నది. ఈ సినిమా రాబోయే రోజుల్లో ఇండియన్ సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ బెంచ్ మార్క్ సెట్ చేయనున్నదనే విషయం కలెక్షన్లు రుజువు చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా, 2023 సంవత్సరంలో రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజైన షారుక్ చిత్రం పఠాన్ కూడా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది. పఠాన్ చిత్రం 1070 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా సాధించి పెట్టింది. గత ఆరు నెలల వ్యవధిలోనే షారుక్ చిత్రం మరో 1000 కోట్ల రూపాయలు వసూలు చేయబోతున్నది. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో రెండుసార్లు 1000 కోట్లు సాధించిన హీరోగా రికార్డును సొంతం చేసుకొన్నారు.
ఇదిలా ఉండగా, షారుక్ ఖాన్ నటించిన మూడో సినిమా 2023 సంవత్సరంలో రిలీజ్ కాబోతున్నది. పాపులర్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వం వహించి నిర్మించిన డంకీ చిత్రం డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో తాప్సీ పన్ను హీరోయిన్‌గా నటిస్తున్నది. అయితే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుందని అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఇటీవల డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. డంకీ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పఠాన్, జవాన్ సినిమా కలెక్షన్లను డంకీ సినిమా తిరగరాస్తుంది. ప్రతీ సినిమా ముందు వచ్చిన మూవీ కలెక్షన్లను అధిగమించాలి. నేను తీయబోయే సినిమా జవాన్ కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టాలని కోరుకొంటాను అని అట్లీ అన్నాడు.

షారుక్ ఖాన్‌తో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఒకే సంవత్సరంలో రెండుసార్లు 1000 కోట్లు రాబట్టిన హీరో ఉండరమో.. షారుక్ ఖాన్‌కే అది సాధ్యపడింది. షారుక్ ఖాన్ ఇలాంటి విజయాలు మరిన్నీ సాధించాలని నేను కోరుకొంటున్నాను. డంకీ చిత్రం తప్పకుండా సెన్సేషనల్ హిట్ కావాలని కోరుకొంటున్నాను అని అట్లీ అన్నారు.


Click it and Unblock the Notifications











