విడిపోయిన మరో సెలబ్రిటీ జంట.. విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్, 18 ఏళ్ల బంధానికి ముగింపు!

టాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండస్ట్రీలో కూడా ఈ మధ్య కాలంలో వరుస విడాకుల ప్రకటనలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు జంటలు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటిచడం మనకు తెలిసిందే. ఇప్పుడు అనుకోని రీతిలో మరో స్టార్ డైరెక్టర్ కూడా విడాకులు తీసుకున్నారు అని తెలుస్తోంది. ఇంతకీ ఎవరా దర్శకుడు? ఏమిటా విడాకుల కధ? అన్న వివరాల్లోకి వెళితే

మరో సెలబ్రిటీ జంట

మరో సెలబ్రిటీ జంట

ఇటీవల చిత్ర పరిశ్రమలో విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తెలుగులో సమంత, చైతు.. కొన్ని రోజుల క్రితం ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ విడిపోతున్నట్లు ప్రకటించారు. తమిళ సంగీత దర్శకుడు ఇమ్మాన్ కూడా ఇటీవల విడాకులు తీసుకున్నట్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో సెలబ్రిటీ జంట డివోర్స్ తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

షాకింగ్ న్యూస్

షాకింగ్ న్యూస్

నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ బాల గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. తమిళ సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా మారారు బాల. ఆయన చేసిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి. అలా ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. బాల తెరకెక్కించే సినిమాలు చాలా విభిన్నంగా ఉండడమే కాదు చాలా ఎమోషనల్ కంటెంట్ తో విలక్షణంగా ఉంటాయి. విభిన్నమైన దర్శకుడిగా గుర్తింపు పొందిన బాల గురించి షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది.

అధికారికంగా విడాకులు

అధికారికంగా విడాకులు

తాజాగా బాల పర్సనల్ లైఫ్ లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. డైరెక్టర్ బాల తన భార్య ముధుమలార్ తో విడాకులు తీసుకున్నారు. అందుతున్న సమాచారం మేరకు బాల, ముధు మలార్ మధ్య నాలుగేళ్ల క్రితం విభేదాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి వారిద్దరూ విడిగానే ఉంటున్నారట. ఆ తర్వాత ఫ్యామిలీ కోర్టులో ఇద్దరూ విడాకులకు అప్లై చేసినట్లు తెలుస్తోంది. మార్చి 5వ తేదీన వీరిద్దరూ అధికారికంగా విడాకులు పొందినట్టు సంహారం. .

18 సంవత్సరాల పాటు

18 సంవత్సరాల పాటు

పరస్పర అంగీకారంతో బాలా, మలార్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిద్దరికి ప్రార్థన అనే పాప కూడా ఉండి. దర్శకుడు బాలా మరియు ముత్తుమలర్ జూలై 5, 2004న మధురైలో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. 18 సంవత్సరాల పాటు కలిసి ఉన్న తర్వాత, వారు ఆ వివాహ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు

సినిమాల విషయానికి వస్తే

సినిమాల విషయానికి వస్తే

బాలా తన తదుపరి సినిమా మీద ఫోకస్ పెడుతూ ఉండగా మలర్ తరచుగా జయం రవి భార్య ఆర్తి, గాయని సైంధవి మరియు పరిశ్రమకు చెందిన ఆమె స్నేహితులతో కెమెరాల కంటికి పలు సందర్భాల్లో కనిపించింది. బాల డైరెక్షన్లో సూర్య, విక్రమ్ కలిసి నటించిన శివ పుత్రుడు చిత్రం సంచలనం సృష్టించింది. ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది.

అలాగే 2008లో బాల 'నాన్ కదవుల్' చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఇక చివరిగా విక్రమ కుమారుడు ధృవ్ హీరోగా లాంచ్ కావాల్సిన ఆదిత్యవర్మ సినిమాను ముందు బాల తెరకెక్కించారు, ఆ సినిమా విక్రమ్ కు నచ్చక పోవడంతో ఆపేశారు. ఇదిలా ఉండగా బాల తదుపరి చిత్రం హీరో సూర్యతో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X