Don't Miss!
- News జనసేన గెలిచే సీట్లేవి,మూడు రీజియన్లలో ఎవరికెన్ని -తేల్చేసిన సర్వే..!!
- Automobiles తగ్గిన వాహనాల ఎగుమతులు.. అయినా టాప్లో మారుతి సుజుకి.. కారణాలివే.!!
- Sports KKR vs RR: బట్లర్ కాదు.. అతని వల్లే గెలిచాం: సంజూ శాంసన్
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
శివపుత్రుడు దర్శకుడితో సూర్య మరో భారీ మల్టీస్టారర్.. మట్టి వాసన కనిపించేలా..
రీసెంట్ గా ఆకాశం నీ హద్దురా సినిమాతో అసలైన ఓటీటీ హిట్ అందుకున్న హీరో సూర్య అటు తమిళ్ లోనే కాకుండా తెలుగు జనాలను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు. సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి ఉంటే భారీ స్థాయిలో విజయాన్ని అందుకునేదని కామెంట్స్ అయితే గట్టిగా వస్తున్నాయి. ఇక నెక్స్ట్ కూడా ఇదే తరహాలో విజయాలను అందుకోవాలని సూర్య అడుగులు వేస్తున్నాడు. త్వరలో బాలా దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఆ సినిమాతోనే కెరీర్ యూ టర్న్
సూర్య కెరీర్ లో నటనకు ప్రాధాన్యం ఉన్న కథలనే ఎక్కువగా ఎంచుకున్నాడు. కమర్షియల్ సినిమాల్లో కూడా విభిన్న పాత్రలలో కనిపించి తనలోని టాలెంట్ ని బయటపెట్టాడు. అయితే సూర్య కెరీర్ యూ టర్న్ తీసుకోవడానికి ప్రధాన కారణం శివపుత్రుడు సినిమాలో అతను చేసిన సపోర్టింగ్ రోల్ అనే చెప్పాలి. విక్రమ్ డామినేట్ చేసినప్పటికీ సూర్య నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.
సూర్య కోసం మరో పర్ఫెక్ట్ కథ
తనలో కూడా అద్భుతమైన నటుడు ఉన్నట్లు నిరూపించింది దర్శకుడు బాలా అంటూ చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు సూర్య. అందుకే ఆయనతో సినిమా చేయడానికి ఎప్పుడైనా రెడీ అని కూడా అంటాడు. ఇక ఇన్నాళ్లకు దర్శకుడు బాలా సూర్య కోసం ఒక పర్ఫెక్ట్ కథను సెట్ చేసినట్లు తెలుస్తోంది. వాడు వీడు సినిమా తరువాత బాలా ఇంతవరకు సరైన హిట్ కొట్టలేదు.
మరో మల్టీస్టారర్ సినిమా..
ఆ మధ్య జ్యోతికతో చేసిన నాచియర్ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక తెలుగులో హిట్టయిన అర్జున్ రెడ్డి రీమేక్ ను వర్మగా తెరకెక్కించడంతో ఆ సినిమా రిలీజ్ కాకుండానే అటకెక్కేసింది. ఇక ఫైనల్ గా ఇన్నాళ్లకు దర్శకుడు బాల మరో మంచి మల్టీస్టారర్ స్టోరీని సెట్ చేసుకున్నట్లు టాక్ వస్తోంది. బాల ఎలాంటి కథలోనైనా రియాలిటీ అనేది చాలా పదునుగా ఉంటుంది. అందుకే ఆయనతో ఒక్క సినిమా చేసిన చాలని అనుకుంటారు.
మిగతా హీరోలు ఎవరంటే..
ఇక బాల ఫామ్ లో లేకపోవడంతో ఆయనతో సినిమా అంటే కొందరు వెనుకడుగు వేస్తున్నారు. అయినప్పటికీ సూర్య నమ్మకంతో సినిమా చేయడబికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. హీరోలు ఆర్యతో పాటు అథర్వ కూడా సూర్యతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని టాక్. ఇక ఆ సినిమా బాల రెగ్యులర్ రియాలిటీ స్టైల్ లోనే ఉంటుందట. చినుకులతో తడిసిన నేల నుంచి వచ్చే మట్టివాసన ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ ని మళ్ళీ వెండితెరపై చూపించబోతున్నాడట ఈ దర్శకుడు. వచ్చే ఏడాది సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉన్నట్లు సమాచారం.