థ్రిల్లర్ సినిమా కోసం భార్యని చంపేశాడు.. నటి సంధ్య హత్యకేసులో సంచలనాలు!
తమిళ దర్శకుడు అనుమానంతో తన భార్యని అతి కిరాతకంగా చంపిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. కాదల్ ఇళవసం అనే చిత్రంతో దర్శకుడిగా మారిన బాలకృష్ణన్ తన భార్య సంధ్యని అనుమానంతో హత్య చేశాడని అంతా భావించారు. బాలకృష్ణన్ వయసు 51 ఏళ్ళు. అతని భార్య సంధ్య వయసు 35 ఏళ్ళు. వీరిద్దరికి పిల్లలు కూడా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా వెల్లడించిన విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం!

అతికిరాతకంగా
గత నెలలో దర్శకుడు బాలకృష్ణన్ నటి, తన భార్య అయిన సంధ్యని అతికిరాతకంగా ముక్కలుగా నరికి చంపాడు. ఈ కేసుని ఛేదించడానికి పోలీసులకు 20 రోజుల సమయం పట్టింది. బాలకృష్ణన్ ఈ హత్య చేశాడని పోలీసులకు నిర్ధారణకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల క్రితమే అతడిని అరెస్ట్ చేశారు. సంధ్యని కత్తితో పొడిచి హత్య చేసిన తర్వాత ఆమె మృత దేహాన్ని ముక్కలుగా నరికి చెత్త కుప్పలో పడేశాడు.

అనుమానంతోనే
బాలకృష్ణన్ తన భార్యపై అనుమానంతోనే ఈ ఘటనకు పాల్పడ్డాడని మొదట అంతా భావించారు. సంధ్య సినిమాల్లో నటిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. అందుకు ఆమె భర్త సహకరించకపోవడంతో సొంతగా నిర్మాతలని, దర్శకులని కలుసుకునేది. ఈ క్రమంలో సంధ్య కొందరితో అక్రమ సంబంధం పెట్టుకుందని బాలకృష్ణన్ అనుమానపడ్డాడు. ఈ విషయంలో భార్యతో జరిగిన గొడవలో ఆమెని హత్య చేసినట్లు పోలీసులు మొదట భావించారు.

థ్రిల్లర్ సినిమా కోసం
కానీ తాజాగా పోలీస్ విచారణలో బాలకృష్ణన్ సంచలన విషయాన్ని బయట పెట్టినట్లు తెలుస్తోంది. బాలకృష్ణన్ దర్శత్వం వహించిన కాదల్ ఇళవసం చిత్రం దారుణంగా పరాజయం చెందింది. ప్రస్తుతం బాలకృష్ణన్ మరో చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. తన స్నేహితుడు ఓ థ్రిల్లర్ సినిమాకు సంబందించిన కథ, స్క్రీన్ ప్లే అందించారట. దానిప్రకారం తన భార్యని ఏడు ముక్కలుగా నరికి చెత్తకుప్పలో పడేసినట్లు బాలకృష్ణన్ పోలిసుల వద్ద అంగీకరించినట్లు తెలుస్తోంది.

సినిమా చేయడానికి
తన భార్య సంఘటననే సినిమా చేయడానికి బాలకృష్ణన్ సిద్దపడ్డాడట. అంతలోగా అతడి బండారం బయటపడింది. బాలకృష్ణన్ గతంలో ఓ పార్టీలో రాజకీయ నేతగాకూడా పనిచేశాడు. రాజకీయాల్లో విజయం దక్కకపోవడంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. తనకు ఉన్న పరిచయాలతో దర్శకుడిగా మారాడు.


Click it and Unblock the Notifications











