షాకింగ్: ఇంట్లో శవమై కనిపించిన అజిత్ దర్శకుడు.. కుళ్లిపోయిన మృతదేహం, ఏం జరిగింది!
తమిళ దర్శకుడు సి. శివకుమార్ అనుమానాస్పద పరిస్థితుల మధ్య మృతి చెందారు. చెన్నై లోని తన నివాసంలో ఆయన మృతి చెందడం సంచలనం రేపుతోంది. ఈ విషయం తెలిసిన వెంటనే తమిళ సినీప్రముఖులు షాక్ కి గురవుతున్నారు. శివకుమార్ మరణానికి కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కెరీర్ ఆరంభంలో శివ కుమార్ లెజెండరీ దర్శకుడు భాగ్యరాజ్ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశారు.

ఆత్మహత్యా లేక
చెన్నైలోని సాలిగ్రామంలో గల ఓ అపార్ట్ మెంట్ లో శివ కుమార్ నివాసం ఉంటున్నారు. తాజాగా ఆయన మృతి చెందిన విషయం తెలియడంతో చెన్నై పోలీసులు ఆ ఇంటిని పరిశీలించారు. శివకుమార్ మృత దేహం కుళ్లిపోయి కనియించింది. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక మర్డర్ జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రాధమికంగా
శివకుమార్ మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇంత వరకు అతడి కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. శివకుమార్ మృతి చెంది శవం కుళ్ళే వరకు ఈ విషయం బయటకు ఎందుకు రాలేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రాధమికంగా ఈ కేసులో పోలీసులకు ఎలాంటి ఆధారం లభించలేదు.

అజిత్‌కు దర్శకుడిగా
ప్రస్తుతం తమిళంలో అజిత్ క్రేజ్ గురించి మాటల్లో చెప్పలేం. అజిత్ కెరీర్ ఆరంభంలో శివకుమార్ దర్శత్వంలో నటించాడు. అజిత్, రాశి నటించిన రెట్టయి జాడి వయసు చిత్రానికి శివకుమార్ దర్శకత్వం వహించారు.

సినీప్రముఖుల సంతాపం
శివకుమార్ మృతి చెందడంతో తమిళ చిత్ర పరిశ్రమ సంతాపం తెలియజేస్తోంది. అర్జున్ నటించిన ఆయుధ పూజై చిత్రానికి కూడా శివకుమారే దర్శకుడు. ఆయన మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం కు పంపారు. విచారణ ద్వారా నిజానిజాలు వెలుగులోకి రానున్నాయి.


Click it and Unblock the Notifications











