"తప్పు దర్శకుడిదే"
సినిమా హీరోయిన్లంటే అందరికీ చులకనే. నిర్మాతలకైతే మరీను. ఈ తరహా వ్యవహారం ఏ భాషలోనైనా అంతే. తమిళంలో చక్రవ్యూహం సినిమా షూటింగ్ ను జరుపుకుంటోంది. ఈ సినిమాలో హీరోయిన్ పేరు డైసీ. దర్శకుడు ఉదయ్ భాను మహేశ్వరన్. అయితే హీరోయిన్ సరిగా షూటింగ్ కు హాజరుకావడంలేదని దర్శకుడు ఫిర్యాదు చేశాడు. సరిగా హాజరుకాకపోవడమే కాదు పలు సమస్యలు సృష్టిస్తోందని ఆయన అంటున్నాడు.
ఇందుకు కారణం దర్శకుడు, హీరోనే అంటోంది హీరోయిన్ డైసీ. ఈ సినిమాలో నటించినందుకుగాను రూ.5లక్షలు ఇస్తామని వారు మాట ఇచ్చారు. ముందు రూ.3 లక్షలు ఇచ్చే ఖరారు. అయితే రూ.50వేలే ఇచ్చారు. ఆ తరువాత రూ.3లక్షలు ఇచ్చారు. ఇంకా నాకు రూ.1.5లక్షలు బాకీ ఉన్నారు. అవి ఇవ్వడంలేదు. ఇదే విషయమై ఎప్పుడు అడిగినా వారే నాకు సమస్యలు సృష్టిస్తున్నారు. నా వల్ల షూటింగ్ ఆలస్యమవుతుందనడంలో అర్థంలేదు..హీరో నటరాజ్ వల్లే ఆలస్యమంతా..ఆయన హిందీ సినిమా కోసం వెళ్లాడు...సినిమా పబ్లిసిటీ కోసమే దర్శకుడు నన్ను ఆడిపోసుకుంటున్నాడు...అంది.


Click it and Unblock the Notifications











