హీరోయిన్ స్నేహ అఫైర్లను బయటపెట్టిన స్టార్ డైరెక్టర్.. ఆ హీరోతో డేటింగ్ తట్టుకోలేక డైరెక్టర్ దాడి అంటూ

కుటుంబ కథా చిత్రాలకు , హోమ్లీ క్యారెక్టర్లకు కేరాఫ్‌గా నిలిచారు స్నేహ. సౌందర్య తర్వాత మళ్లీ అంతగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన నటి ఆమె మాత్రమే. చక్కటి తెలుగుదనం ఉట్టిపడేలా నుదిటిపై బొట్టు, కళ్లకు కాటుక, చీరకట్టుతో ఆకట్టుకున్న స్నేహ రాధా గోపాళంలో బాపు బొమ్మలా కనిపించి.. శ్రీరామదాసులో భక్తుడైన రామదాసుకు భార్యగా నటించింది. చూడటానికి పక్కింటి అమ్మాయిలా సాంప్రదాయబద్ధంగా ఉండే స్నేహకు దక్షిణాదిలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా సహజంగా ఉండే క్యారెక్టర్లతోనే ఆమె ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

ఆమె సినిమాల్లోకి రావడం ఆశ్చర్యకరంగా జరిగింది. దుబాయ్‌లోనే ప్లస్ 2 వరకు చదువుకుంది. ఒకసారి స్నేహ దుబాయ్‌లో ఒక స్టార్ నైట్ షోలో పాల్గొన్న మోహన్ లాల్, ముమ్మట్టి, మీనాలు హాజరవ్వగా వారి ఆటోగ్రాఫ్‌ల కోసం స్నేహ నిలబడి ఉండటం చూసి ఫాజిల్ .. సినిమాల్లో నటిస్తావా అని అడిగారట. అనంతరం తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సినిమాల్లో అడుగుపెట్టారు. ప్రియమైననీకు, తొలివలపు, సంక్రాంతి, శ్రీరామదాసు, పాండురంగడు, రాజన్న, వెంకీ, హనుమాన్ జంక్షన్, రాధా గోపాలం, మధుమాసం, అమరావతి తదితర చిత్రాలతో స్నేహ తెలుగువారి హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకుంది. 2012లో తమిళ నటుడు ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Director Geetha Krishna sensational comments on Heroine Sneha affairs

వివాహం తర్వాత భర్త, పిల్లలతో ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న స్నేహ.. సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. సీనియర్ హీరోయన్లు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుండటంతో స్నేహ కూడా ఇదే బాటలో రీ ఎంట్రీ ఇచ్చారు. అక్క, వదిన ఇతర సహాయక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎలాంటి పాత్రనైనా మెప్పించగల టాలెంట్ ఈమె సొంతం. అందుకే అవకాశాలు కూడా స్నేహను వెతుక్కుంటూ వస్తున్నాయి.

అయితే అందరు హీరోయిన్ల మాదిరిగానే స్నేహ పైనా ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఆవిడ ఫలానా హీరోతో రిలేషన్‌లో ఉన్నారని, పెళ్లికి రెడీ అయ్యిందని అప్పట్లో గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు గీతా కృష్ణ స్పందించారు. ఇటీవల ఓ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. ప్రసన్న కంటే ముందే స్నేహ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని అప్పట్లో ఓ వార్త వైరల్ అయ్యిందని తెలిపారు. ఓ స్టార్ ప్రొడ్యూసర్‌ని ప్రేమించడంతో పాటు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుందని, తీరా పెళ్లి జరగబోతోంది అనుకున్న సమయంలో అతనికి వేరే అమ్మాయిలతో ఉన్న ఎఫైర్స్ స్నేహకు తెలియడంతో ఎంగేజ్‌మెంట్‌‌ను క్యాన్సిల్ చేసుకుందని వెల్లడించారు.

Director Geetha Krishna sensational comments on Heroine Sneha affairs

సుశీ గణేషన్ అనే దర్శకుడు స్నేహను ఎంతగానో ప్రేమించాడని అయితే ఆమె మరో హీరోతో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేకపోయాడని గీతాకృష్ణ తెలిపారు. ఓ రోజు కోపంలో స్నేహపై గణేశ్ దాడి చేయడంతో ఆమె గాయపడిందని చెప్పారు. పెళ్లికి ముందు ఇవన్నీ సర్వసాధారణమని.. వివాహం తర్వాత స్నేహ తన ఇంటిని అద్భుతంగా చక్కబెడుతోందని, ఫ్యామిలీని బాగా చూసుకుంటోందని గీతాకృష్ణ ప్రశంసించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X