twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వారి గొప్పదనంపై సినిమాలు తీసినందుకు సిగ్గేస్తోంది.. దారుణ ఘటనపై డైరెక్టర్ కామెంట్స్

    |

    కోలీవుడ్ కాప్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ హరి. ఆయన తీసిన చిత్రాల్లో దాదాపు పోలీసుల గొప్పదనాన్ని చాటిచెప్పేవే. కర్తవ్యం, విధి నిర్వహణ, బాధ్యతలతో కూడుకున్న పోలీసు కథలను తెరకెక్కించి భారీ సక్సెస్ కొట్టాడు. సామి, సింగం, సింగం 2, సింగం 3 వంటి సినిమాలను తెరకెక్కించిన హరి ప్రస్తుతం తెగ ఫీలవుతున్నాడు. తమిళనాడులో పోలీసుల దారుణ ప్రవర్తనపై హరి ఎమోషనల్ అయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

    సామాన్యులపై పోలీసుల జులుం..

    సామాన్యులపై పోలీసుల జులుం..

    ట్యూటికోరన్‌లో లాక్ డౌన్‌లో తమ షాపును చెప్పిన సమయం కంటే ఎక్కువ సేపు తెరిచి ఉంచినందుకు జయరాజ్, ఫినిక్స్‌లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడ వారు పెట్టిన చిత్ర హింసలు, ప్రయోగించిన థర్డ్ డిగ్రీ మూలంగా వారిద్దరు ప్రాణాలు వదిలారు. ఈ ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది.

    ఆలస్యంగా వెలుగులోకి..

    ఆలస్యంగా వెలుగులోకి..

    ఆ తండ్రీకొడుకులు పోలీసుల అన్యాయానికి బలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ఘటనపై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా మొత్తం అట్టుడుకుంది. Justice For Jeyaraj And Fenix అనే హ్యాష్ ట్యాగ్ తమిళ ప్రజలు దేశమంతా ట్రెండ్ చేశారు.

    వివరించిన సుచిత్ర..

    వివరించిన సుచిత్ర..

    తమిళ నాడులో జరిగిన ఈ ఘటన భాష వల్ల అందరికీ చేరడం లేదని, ఇంగ్లీష్‌లో వివరించింది. అసలు జరిగింది ఏంటి?పోలీసులు ఎంత క్రూరంగా ప్రవర్తించారో పూస గుచ్చినట్టు చెప్పుకొచ్చింది. సుచిత్ర షేర్ చేసిన వీడియా చాలా మందికి చేరుకుంది. రోజురోజుకూ ఈ ఘటనపై పోరాటం తీవ్రతరం దాల్చుతోంది.

    సెలెబ్రిటీలు ఫైర్..

    సెలెబ్రిటీలు ఫైర్..

    పోలీసుల దౌర్జన్యంపై సెలెబ్రిటీలు ఫైర్ అయ్యారు. కుష్బూ, హన్సిక, జయం రవి, జీవా, విశాల్, శృతీ హాసన్, పా రంజిత్ వంటి వారంతా స్పందించారు. ఈ ఘటనకు తగిన న్యాయం జరిగే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని అంటున్నారు. కేవలం పోలీసులను సస్పెండ్ చేస్తే సరిపోదని పేర్కొన్నారు.

    సినిమాలు తీయడం బాధగా ఉంది..

    సినిమాలు తీయడం బాధగా ఉంది..

    పోలీసులు చేసిన ఈ పనిపై దర్శకుడు హరి స్పందిస్తూ.. ‘మరోసారి ఇలాంటి ఘటనలు తమిళనాడులో పునరావృత్తం కాకూడదు. కొందరు అధికారుల వల్ల మొత్తం డిపార్ట్‌మెంట్‌కు చెడ్డ పేరు వస్తుంది. నా ఐదు చిత్రాల్లో పోలీసులను గొప్పగా చూపించినందుకు బాధగా ఉంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి' అని పేర్కొన్నాడు.

    English summary
    Director Hari Feel Regret For Doing Movies On Police. Such incidents shouldn't take place in Tamil Nadu again. Due to a few officers, the whole police department is now tainted. I regret making five films celebrating police
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X