సిమ్రాన్ కష్టాలు..సీనియర్ హీరో ఓదార్పు!!

పాపం సిమ్రాన్ సెకెండ్ ఇన్నింగ్స్ పరిస్ధితి ఏం బాగో లేదు. అలాగని సిమ్రాన్ కాంప్రమైజ్ అయి ఒళ్ళు దగ్గరపెట్టుకుని షూటింగ్స్ కి టైమ్ కి అటెండ్ కాదు. ఆమె తాజాగా యాక్షన్ చిత్రాలతో తనకంటూ పేరు తెచ్చుకున్న తమిళ దర్శకుడు హరి చిత్రం 'Seval'లో ముఖ్య పాత్ర చేస్తోంది. భరత్ హీరోగా చేస్తున్న ఆమె రోజూ సెట్స్ కి లేటుగా వస్తోంది. చాలా సార్లు హరి చెపుదామనుకున్నా సర్లే మనకెందుకులే ...సీనియర్ నటి కదా అని ఆగుతున్నాడు. ఏరోజన్నా అడుగుతామనుకున్నా అప్పటికే తయారుచేసుకున్న స్క్రిప్టుతో సమాధానం చెప్తోందిట.
విని విని విసుగెత్తిన హరి మొన్న షూటింగ్ లో ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఆమె లేటుగా రాగానే తన కోడైరక్టర్ ని పిలిచి ఏం పిచ్చిగా ఉందా లేటుగా వస్తున్నావ్...అంటూ అరిచి ...ఆ చెంపా ఈ చెంపా వాయించాడు. తర్వాత ఆమె వంక చూసి కూల్ గా ఆహ్వానించి...చూడండి మీరు నటులు లేటుగా వచ్చినా ఏదో ఒకటి షూటింగ్ చేసి ఎడ్జెస్ట్ అవ్వొచ్చు ...కానీ డైరక్షన్ డిపార్ట్ మెంట్ వాళ్ళే ఇలా అయితే ఎలా అన్నాడట. ఆమెకు ఏం అనాలో అర్ధంకాక తలూపింది.
తర్వాత సిమ్రాన్ ఎంక్వైరీ చేస్తే అతను లేటుగా రాలేదని హరి కన్నా ముందే వచ్చేడని తనని మందలించటానికే ఇలా చేసేడని కిక్కురుమనుకుండా మరుసటి రోజు నుంచి కరెక్టు రోజుకీ వచ్చిందిట. అయితే ఈ విషయాన్ని ఆమె తనకి బాగా క్లోజ్ అయిన ఓ తెలుగు హీరోతో చెప్పుకుని భాధ పడింది పోన్లో . అతను దాన్ని కామిడీ చేస్తూ తన సెట్లో లో వారికి చెప్పడం అంతా నవ్వటం...ఇక్కడా ఆ విషయం పాపులర్ కావటం జర్గింది. ఇంతకీ ఆమె అంత క్లోజ్ గా విప్పి అదే... మనసు విప్పి మాట్లాడే హీరో ఎవరంటారు...


Click it and Unblock the Notifications











