డైరెక్టర్-హీరోయిన్ ల ఆన్ స్ర్కీన్-ఆఫ్ స్ర్కీన్ రొమాన్స్...?
తానేది చేసినా తన గురవు ప్రభుదేవాని ఫాలో అయ్యే లారెన్స్ అఫైర్ విషయంలో కూడా తానేమీ తక్కువ తినలేదని నిరూపించుకుంటున్నాడట. ప్రభుదేవా-రామలత్ కు నిన్న విడాకులు అమంజూరైన విషయం తెలింసదే. ప్రభుదేవా నయనతారతో గ్రంధం నడిపినట్టే లారెన్స్ కూడా తెరవెనుకు హీరోయిన్ లక్ష్మీరాయ్ తో హాట్ హాట్ ఎఫైర్ కొనసాగిస్తున్నాడని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.
టాలీవుడ్ లో కాంచనమాలా కేబుల్ టీవీ చిత్రం ద్వారా పరిచయమైన లక్ష్మీకి ఆతర్వాత అంతగా ఆఫర్స్ రాలేదు. తర్వాత లారెన్స్ తోనే సూపర్ కౌబాయ్ లో నటించిందని అప్పటి నుండి వీరిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారని సమాచారం. విషయం పెళ్ళి వరుకు కూడా వచ్చిందన్నది తాజా వార్త. అందువల్లనే 'కాంచన" సినిమాలో ఆఫరిచ్చి అటు ఆన్ స్ర్కీన్ ఇటు ఆఫ్ స్ర్కీన్ లో రొమాన్స్ చేస్తున్నారని ఫిల్మిం నగర్ లో వినిపిస్తున్నాయి. విడుదలకు సిద్దం కాబోతున్న కాంచన చిత్రంలో నటిస్తున్న ఈ హాట్ ఫెయిర్ తమపై వస్తున్న గాసిప్స్ ని ఎక్కడా కూడా ఖండించకపోవడంతో ఈ వార్తలు నిజమేనని అందరూ అనుకుంటున్నారు. ఏది ఏమైనా నిప్పు లేకుండా పొగ రాదు కదా..!


Click it and Unblock the Notifications











