మహేంద్రన్ మరణం: కమల్, మణిరత్నం, శంకర్ కంటతడి.. మౌనంగా రొదించిన రజనీకాంత్
దిగ్గజ దర్శకుడు జే మహేంద్రన్ మృతితో తమిళ చిత్ర పరిశ్రమ మూగబోయింది. ఎంతో మంది దర్శకులకు స్ఫూర్తిగా నిలిచిన ఆయన ఇకలేరనే వార్తతో కోలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. గత కొద్దికాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మహేంద్రన్ చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అభిమానులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆయన భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. మహేంద్రన్ భౌతికకాయాన్ని దర్శించుకొన్న వారిలో...

దిగ్గజ దర్శకుడికి ప్రముఖుల శ్రద్దాంజలి
ప్రముఖ దర్శకుడు జే మహేంద్రన్ మరణ వార్తతో తమిళ, తెలుగు సినిమా వర్గాల తల్లడిల్లిపోయారు. వార్త తెలిసిన వెంటనే దర్శకుడి నివాసానికి వెళ్లి రజనీకాంత్, కమల్ హాసన్, మణిరత్నం, శంకర్, సుహాసిని, రాధిక శరత్ కుమార్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు.

మణిరత్నం, శంకర్ కంటతడితో
తాను డైరెక్టర్‌గా మారడానికి స్ఫూర్తిని కలిగించిన మహేంద్రన్ భౌతికకాయాన్ని చూసి మణిరత్నం, శంకర్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఓ దశలో కంటతడి పెట్టుకొన్నారు. భార్య సుహాసినితో కలిసి మణిరత్నం దిగ్గజ దర్శకుడికి నివాళులర్పించారు.

భావోద్వేగంలో కమల్ హాసన్
దర్శకుడు జే మహేంద్రన్ పార్దీవ దేహానికి విలక్షణ నటుడు కమల్ హాసన్ బాధతప్త హృదయంతో శ్రద్దాంజలి ఘటించారు. నిర్జీవంగా కనిపించిన దర్శకుడిని చూసి కమల్ హాసన్ భావోద్వేగానికి లోనయ్యారు.

మౌనంగా రోదించిన రజనీకాంత్
గరువు, తనకు సూపర్ స్టార్ హోదాను కల్పించిన మహేంద్రన్ మరణ వార్తతో సూపర్ స్టార్ రజనీకాంత్ విషాదంలో మునిగిపోయారు. మహేంద్రన్ భౌతికకాయం వద్ద మౌనంగా రోదించారు. పుట్టెడు విషాదంలో మునిగిన కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. ఓ దశలో మాటల రాని పరిస్థితిలో రజనీకాంత్ పూర్తిగా గంభీరంగా మారిపోయారు.

రజనీకాంత్‌ను సూపర్ స్టార్‌గా
రజనీకాంత్‌ను సూపర్‌స్టార్‌గా మలవడంతో దర్శకుడు జే మహేంద్రన్‌ది గొప్ప పాత్ర. రజనీ నటించిన ముల్లమ్ మలరమ్ చిత్రంతో దర్శకుడిగా తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. 1980లో ఆయన రూపొందించిన నేంజథాయ్ కిలాథే చిత్రానికి మూడు జాతీయ అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫి, బెస్ట్ ఆడియోగ్రఫి అవార్డులు ఆ చిత్రం అందుకొన్నది.

నటుడిగా, దర్శకుడిగా మహేంద్రన్
గత మూడు దశాబ్దాల సినీ జీవితంలో కాళీ, జానీ, పనక్కర పిళ్లై, తంగ పాతక్కమ్, ఉత్తిరిపూక్కల్ లాంటి అత్యంత ప్రజాదరణ చిత్రాలను రూపొందించారు. నటుడిగా కామరాజ్, తెరీ, కాటమరాయుడు, నిమిర్, మిస్టర్ చంద్రమౌథి, సీతాకత్తి, పేట్టా చిత్రంలో నటించారు. ఆయన చివరి చిత్రం బూమరాంగ్.


Click it and Unblock the Notifications











