'ప్రేమదేశం' కదిర్‌కు పెళ్లి కుదిరింది

సెప్టెంబరు రెండోతేదీన మదురై జిల్లా తిరుపరగుండ్రంలో పెళ్లి, నాలుగోతేదీన చెన్నైలో వివాహ విందు జరగనున్నాయి. ఈ విషయమై ఆయన అఫీషియల్ గా ప్రకటన చేసారు. ఇక కదిర్ కెరీర్ ఇప్పుడు అనుకున్నంత స్దాయిలో లేదు. ఆయన సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఈ నేపధ్యంలో ఆయన వివాహం చేసుకుని కొత్తగా మరో ఇన్నింగ్స్ ప్రారంభించాలని బావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.
ఇక రెండేళ్ల క్రితం కదిర్ డైరక్షన్ లో వరుణ్ సందేశ్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్నారని వార్తలు వచ్చాయి. అలాగే ఈ చిత్రానికి 'జై హో' అనే టైటిల్ పెట్టనున్నట్లు చెప్పుకున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఓ ప్రేమ కావ్యంగా రూపొందించాలని ఆయన భావిస్తున్నామన్నారు. శ్రీమహాగణపతి ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మించటానిక ముందుకు వచ్చింది. నిర్మాత, కెమెరామెన్ అయిన ఎమ్.సుధాకర్ ఈ చిత్ర నిర్మాత గా తెలిపారు. ఎఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చే ఈ చిత్రంలోని నటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తామన్నారు. ఈ లోగా ఎందుకనో ఈచిత్రం ఆగిపోయింది.


Click it and Unblock the Notifications











