twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ప్రేమదేశం' కదిర్‌కు పెళ్లి కుదిరింది

    By Srikanya
    |

    Director Kathir to marry
    చెన్నై : 'ప్రేమదేశం', హృదయం చిత్రాలతో తమిళ,తెలుగు ప్రేక్షకులకు, యువకులకు చేరువైన దర్శకుడు కదిర్‌. ఆ తర్వాత 'కాదలర్‌ దినం', 'కాదల్‌ వైరస్‌' చిత్రాలతో అగ్ర దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. దర్శకుడిగా గుర్తింపు సాధించుకున్న కదిర్‌ పెళ్లికొడుకు అయ్యాడు. తంజావూరుకు చెందిన విజయ్‌కుమార్‌, ధనలక్ష్మిల కుమార్తె శాంతినిదేవితో వివాహం నిశ్చయమైంది.

    సెప్టెంబరు రెండోతేదీన మదురై జిల్లా తిరుపరగుండ్రంలో పెళ్లి, నాలుగోతేదీన చెన్నైలో వివాహ విందు జరగనున్నాయి. ఈ విషయమై ఆయన అఫీషియల్ గా ప్రకటన చేసారు. ఇక కదిర్ కెరీర్ ఇప్పుడు అనుకున్నంత స్దాయిలో లేదు. ఆయన సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఈ నేపధ్యంలో ఆయన వివాహం చేసుకుని కొత్తగా మరో ఇన్నింగ్స్ ప్రారంభించాలని బావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.

    ఇక రెండేళ్ల క్రితం కదిర్ డైరక్షన్ లో వరుణ్ సందేశ్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్నారని వార్తలు వచ్చాయి. అలాగే ఈ చిత్రానికి 'జై హో' అనే టైటిల్ పెట్టనున్నట్లు చెప్పుకున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఓ ప్రేమ కావ్యంగా రూపొందించాలని ఆయన భావిస్తున్నామన్నారు. శ్రీమహాగణపతి ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మించటానిక ముందుకు వచ్చింది. నిర్మాత, కెమెరామెన్ అయిన ఎమ్‌.సుధాకర్‌ ఈ చిత్ర నిర్మాత గా తెలిపారు. ఎఆర్ రెహమాన్‌ స్వరాలు సమకూర్చే ఈ చిత్రంలోని నటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తామన్నారు. ఈ లోగా ఎందుకనో ఈచిత్రం ఆగిపోయింది.

    English summary
    
 Kathir, who has made some successful movies including Idhayam, Kadhal Desam and Kadhalar Dhinam is all set to tie the knot with Shanthini Devi. The duo recently got engaged and the wedding date has been fixed for September 2 in Madurai. A grand wedding reception will follow the wedding on September 4 in Chennai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X