శివాజీగణేషన్ అంటే గౌరవమా? భయమా? నటనా?
రజనీకాంత్, శివాజీ కాంబినేషన్లో కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో 'పడయప్పా" చిత్రం రూపొందిన నిషయం తెలిసిందే, ఈ చిత్రం 'నరిసింహ" గా తెలుగులో విడుదలయ్యింది. ఇదిలా ఉంటే శివాజీగణేషన్ ఒకప్పుడు చైన్ స్మోకరే అయినా ఆ తర్వాత మానేశారట. అందుకని 'నరసింహ" సెట్లో ఎవరూ సిగరెట్ కాల్చకూడదని నిబంధన విధించారట.
కానీ రజనీకాంత్, కె.యస్.రవికుమార్ ఒకే గదిలోకి వెళ్ళి సిగరెట్ కాల్చారట. బమటికొచ్చి ఏమీ ఎరగనట్టు ఉన్నారట. కానీ శివాజీ గణేషన్ వాసన పసిగట్టి ఇక్కడ సిగరెట్ కాల్చింది ఎవ్వరూ? అని అడిగారట. వెంటనే రజనీకాంత్, దర్శకుడు కె.యస్.రవికుమార్ కంగారుపడి మేకప్ మేన్ కాల్చాడని అబద్ధం ఆడారట. శివాజీ గణేషన్ మీద ఉన్న గౌరవంతో ఆ రకంగా అబద్ధమాడామని ఇటీవల ఓ సందర్భంలో కె.యస్. రవికుమార్ చెప్పాడు.
More from Filmibeat
shivaji ganesh rajinikanth ksravikumar narasimha padayappa శివాజీగణేషన్ రజనీకాంత్ కెయస్రవికుమార్ పడయప్పా నరిసింహ


Click it and Unblock the Notifications











