అంజలిపై కంప్లైంట్... మళ్లీ వివాదం

కలంజియమ్ రూపొందించే 'వూర్ సుట్రి పురాణం' అనే చిత్రంలో అంజలి నటించాల్సి ఉంది. అయితే షూటింగ్ కు రావట్లేదని అందుకే దక్షిణ భారత నటీనటుల సంఘంలో ఫిర్యాదు చేస్తానని దర్శకుడు మీడియాకి చెప్పారు.
కలంజియమ్ మాట్లాడుతూ ''నేను తీస్తున్న చిత్రం కథానాయిక ప్రాధాన్యం ఉన్నది. చిత్రీకరణ ప్రారంభమయ్యాక 15 రోజుల పాటు అంజలి నటించింది. కొంత భాగం చిత్రీకరణ మిగిలి ఉంది. ఇది గురువారం మొదలైంది. అయితే అంజలి పాల్గొనలేదు అన్నారు.
అలాగే అంజలి లేకుండా సినిమా పూర్తవడం అసాధ్యం. అందుకే షూటింగ్ రద్దు చేయాల్సి వచ్చింది. ఫోనులో సంప్రదించేందుకు విఫలయత్నం చేశా. ఈ సినిమా కోసం ఇప్పటికే రూ.40లక్షలు వెచ్చించాం. ఈ విషయమై ఆమెపై నటుల సంఘంలోనూ నిర్మాతల మండలి, దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేయబోతున్నాను అన్నారు.


Click it and Unblock the Notifications











