కలర్స్ స్వాతి హిట్ సినిమా ఇప్పుడు నవలగా...
చెన్నై : 1960లలోని ప్రేమకావ్యం 'సుబ్రమణ్యపురం'(తెలుగులో అనంతపరుం) గా తెరకెక్కి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. శశికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జై, స్వాతి జంటగా నటించారు. శశికుమార్, సముద్రకని ముఖ్య పాత్రలు పోషించారు. భిన్నమైన కథాంశంతో.. ఊహకు అందని ముగింపుతో అందరి గుండెలను పిండేసిన ఈ చిత్రం గత ఏడాది తమిళ నవలగానూ అక్షరరూపం దాల్చింది.
ఇప్పుడు ఆ నవలను ఆంగ్లంలోనూ తీసుకొచ్చారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకుడు గౌతంమీనన్ దీనిని ఆవిష్కరించారు. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఎస్.వెంకటేశన్ అందుకున్నారు. దర్శకనిర్మాత సముద్రకని, సంగీత దర్శకుడు జేమ్స్ వసంతన్ తదితరులు పాల్గొన్నారు.

1980 సంవత్సరంలో జరిగిన సంఘటనలే ఈ చిత్ర కథ. నాటి వాతావరణాన్నీ, జీవన శైలినీ ప్రతిబింబిస్తుంది. అప్పటి యువకుల కేశాలంకరణలు, దుస్తుల్లో ఫ్యాషన్స్, అప్పటి సంగీతం...అన్నీ తెర మీద కనిపిస్తాయి. సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. ప్రేమ, పగ, స్నేహం అనే అంశాల చుట్టూ తిరుగుతుందీ చిత్రం . ఇక ఈ చిత్రానికి శశికుమార్ దర్శకుడు. మిగతా పాత్రల్లో జై, సముద్రకన్ని, గంజా కరుప్పు చేసారు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ మాత్రం అంతంత మాత్రం ఆడింది.


Click it and Unblock the Notifications











