twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కలర్స్ స్వాతి హిట్ సినిమా ఇప్పుడు నవలగా...

    By Srikanya
    |

    చెన్నై : 1960లలోని ప్రేమకావ్యం 'సుబ్రమణ్యపురం'(తెలుగులో అనంతపరుం) గా తెరకెక్కి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. శశికుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జై, స్వాతి జంటగా నటించారు. శశికుమార్‌, సముద్రకని ముఖ్య పాత్రలు పోషించారు. భిన్నమైన కథాంశంతో.. ఊహకు అందని ముగింపుతో అందరి గుండెలను పిండేసిన ఈ చిత్రం గత ఏడాది తమిళ నవలగానూ అక్షరరూపం దాల్చింది.

    ఇప్పుడు ఆ నవలను ఆంగ్లంలోనూ తీసుకొచ్చారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకుడు గౌతంమీనన్‌ దీనిని ఆవిష్కరించారు. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఎస్‌.వెంకటేశన్‌ అందుకున్నారు. దర్శకనిర్మాత సముద్రకని, సంగీత దర్శకుడు జేమ్స్‌ వసంతన్‌ తదితరులు పాల్గొన్నారు.

    M. Sasi Kumar's Subramaniapuram English Script Book Release

    1980 సంవత్సరంలో జరిగిన సంఘటనలే ఈ చిత్ర కథ. నాటి వాతావరణాన్నీ, జీవన శైలినీ ప్రతిబింబిస్తుంది. అప్పటి యువకుల కేశాలంకరణలు, దుస్తుల్లో ఫ్యాషన్స్‌, అప్పటి సంగీతం...అన్నీ తెర మీద కనిపిస్తాయి. సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. ప్రేమ, పగ, స్నేహం అనే అంశాల చుట్టూ తిరుగుతుందీ చిత్రం . ఇక ఈ చిత్రానికి శశికుమార్ దర్శకుడు. మిగతా పాత్రల్లో జై, సముద్రకన్ని, గంజా కరుప్పు చేసారు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ మాత్రం అంతంత మాత్రం ఆడింది.

    English summary
    Director M. Sasi Kumar's Subramaniapuram English Script Book Released by Director Gautham Vasudev Menon and received by Su. Venkatesan, (Sahitya Academy Winner).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X