ప్రముఖ దర్శకుడి ఆరోగ్య పరిస్థితి విషయం... ఆస్పత్రిలో చేరిక

ప్రముఖ తమిళ దర్శకుడు మహేంద్రన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. రజనీకాంత్‌ను స్టార్ హీరోగా చేసిన ఘనత మహేంద్రన్‌కే దక్కుతుందనే విషయం అందరికీ తెలిసిందే. జానీ, ముల్లమ్ మాలరమ్ చిత్రాలు రజనీని స్టార్ హీరోగా మార్చిన విషయం విదితమే.

79 సంవత్సరాల వయసు గల మహేంద్రన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆయన త్వరగా కోలుకోవాలి. త్వరలోనే ఆరోగ్యవంతుడిగా తిరిగి వస్తారు అని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.

director Mahendran admitted to a hospital in Chennai

గత కొద్దికాలంగా సినిమాలకు, నటనకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆయన నటించిన చిత్రం తెరి. ఈ చిత్రంలో విజయ్‌కు ధీటుగా విలన్ పాత్రలో నటించాడు. చివరిసారిగా కనిపించిన చిత్రం అథర్వ నటించిన బుమరాంగ్ చిత్రం. పేటా చిత్రంలో ఓ కీలక పాత్రలో మెరిశారు. తమిళ సినిమాపై గొప్పగా ప్రభావం చేసిన వారిలో ఆయన ఒకరు. పలువురు దర్శకులు ఆయనను గురువుగా భావిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X