twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెండోసారి తండ్రి అయిన పా రంజిత్.. వారసుడి పేరు ఏమిటో తెలుసా?

    |

    కబాలి, కాలా లాంటి సామాజిక అంశాల నేపథ్యంతో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చిత్రాలు రూపొందించిన దర్శకుడు పా రంజిత్ జీవితంలో మరో మెట్టు ఎక్కారు. పా రంజిత్ రెండోసారి తండ్రి అయ్యారనే వార్త కోలీవుడ్‌ మీడియా వెల్లడించింది. పా రంజిత్ భార్య అనిత ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారని, బాబు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

    పుత్రోత్సాహంతో ఉన్న పా రంజిత్ దంపతులు తమ కుమారుడికి మిలిరాన్ అనే పేరును పెట్టినట్టు సమాచారం. ద్వితీయ సంతానం గురించి పా రంజిత్ అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే మఘజిని అనే కూతురు పా రంజిత్‌కు ఉంది. తమ ఇంట్లోకి వారసుడు రావడంతో పా రంజిత్, అనిత దంపతులు సంతోషంలో ఉన్నారు. తాజాగా నా కూతురు తన జన్మదినాన్ని జరుపుకొన్నారు. తన కూతురు బర్త్ డే సందర్భంగా ప్రత్యేకమైన సందేశాన్ని రాశారు.

    Director Pa Rajinth blessed with baby boy

    ఇక పా రంజిత్ ఫ్యామిలీ లైఫ్ గురించి ప్రస్తావిస్తే.. రంజిత్, అనితది ప్రేమ వివాహం. డిగ్రీ కాలేజీలోనే వారిద్దరు ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. ఓ ప్రైవేట్ వేడుకగా నిర్వహించిన కార్యక్రమంలో పా రంజిత్, అనిత ప్రేమ వివాహం చేసుకొన్నారు.

    పా రంజిత్ ప్రస్తుతం కొత్త చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ఆర్య హీరోగా నటించనున్నారు. వాస్తవానికి సూర్య కోసం బాక్సింగ్ నేపథ్యం కథను రాసారు. కానీ కొన్ని కారణాల వల్ల వర్కవుట్ కాకపోవడంతో ఆ చిత్రాన్ని ఆర్యతో తీస్తున్నారు.

    English summary
    Kollywood Director Pa Rajinth blessed with baby boy. His wife delivered a boy at private hospital in chennai. Ranjith and Anitha have named their son Miliran.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X