twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత ముక్తా శ్రీనివాసన్ కన్నుమూత

    By Bojja Kumar
    |

    ప్రఖ్యాత తమిళ దర్శకుడు, నిర్మాత ముక్తా శ్రీనివాసన్‌(88) ఇక లేరు. మంగళవారం రాత్రి చెన్నైలో అనారోగ్యంతో కన్నుమూశారు. 1957లో వచ్చిన 'ముదలాలి' అనే సినిమా ద్వారా ఆయన దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టారు. ఎస్ఎస్ రాజేంద్రన్ హీరోగా నటించిన ఈ చిత్రం బెస్ట్ తమిళ ఫీచర్ ఫిల్మ్‌గా జాతీయ అవార్డు దక్కించుకుంది.

    ఆరు దశాబ్దాలకుపైగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగిన సాగిన శ్రీనివాసన్ దాదాపు 67 చిత్రాలు రూపొందించారు. అందులో పాంచాలి, నినైవిల్ నిండ్రవన్, సూర్యగాంధీ, సిమ్లా స్పెషల్, పొల్లదావన్ లాంటి ఎన్నో మొమోరబుల్ చిత్రాలు ఉన్నాయి. శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత లాంటి ప్రముఖులతో కలిసి పని చేశారు.

    Director, Producer Muktha Srinivasan no more

    శ్రీనివాసన్‌ నిర్మించిన 'నాయగన్‌' మొట్టమొదటి సారిగా ఆస్కార్‌కు నామినేట్‌ అయిన భారతీయ చిత్రంగా గుర్తింపు పొందింది. బాలచందర్‌, మణిరత్నం​ వంటి ప్రముఖ దర్శకులు ఆయన వద్ద శిష్యరికం చేసినవారే కావడం విశేషం.

    నిర్మాతగా, దివంగత ముఖ్యమంత్రి కామరాజర్‌కు సన్నిహితుడిగా, జీకే మూపనార్‌కు మిత్రుడిగా ఆయనకు పేరుంది. శ్రీనివాసన్ మరణంపట్ల పలువురు తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

    English summary
    Renowned director and producer Muktha V. Srinivasan died on Tuesday night in the city. He was 88 years old. The veteran film-maker directed his first film Mudhalaali in 1957. Starring S.S. Rajendran, the film won the national award for the best feature film in Tamil that year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X