మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్న స్టార్ డైరెక్టర్.. రెండో భార్యతో..

తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ సెల్వరాఘవన్ తన అభిమానులకు, సన్నిహితులకు శుభవార్తను అందించారు. తాజాగా తాను మూడో బిడ్డకు తండ్రి కాబోతున్నట్టు ఆయన సోషల్ మీడియా ద్వారా వార్తను చేరవేశారు. సెల్వరాఘవన్ అందించిన వార్తపై స్పందిస్తూ నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

సొనియా అగర్వాల్‌తో పెళ్లి, విడాకులు

సొనియా అగర్వాల్‌తో పెళ్లి, విడాకులు

దర్వకుడు సెల్వరాఘవన్ వైవాహిక జీవితం విషయానికి వస్తే.. 2006 డిసెంబర్ 15వ తేదీన హీరోయిన్ 7జీ బృందావన్ కాలనీ ఫేమ్ సోనియా అగర్వాల్‌ను వివాహం చేసుకొన్నారు. రెండేళ్ల వైవాహిక జీవితం తర్వాత వారిద్దరూ పరస్పర అవగాహనతో 2009 ఆగస్టులో చెన్నై కోర్టు నుంచి విడాకులు తీసుకొన్నారు.

గీతాంజలిని రెండో పెళ్లి

గీతాంజలిని రెండో పెళ్లి

ఆ తర్వాత గీతాంజలి రామన్‌ని 2011లో వివాహం చేసుకొన్నారు. గతంలో ఆమె మయాక్కమ్ ఎన్నా అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. గీతాంజలి, సెల్వరాఘవన్ దంపతులు 2012 జనవరి 20వ తేదీన లీలావతి అనే పండండి బిడ్డకు జన్మనిచ్చారు. ఆ తర్వాత 2013లో అక్టోబర్ 7వ తేదీన ఓంకార్ అనే మగబిడ్డకు జన్మనిచ్చారు.

మూడో బిడ్డకు జన్మనివ్వనున్న దంపతులు

మూడో బిడ్డకు జన్మనివ్వనున్న దంపతులు

ఇప్పుడు సెల్వరాఘవన్, గీతాంజలి దంపతులు మూడో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమయ్యారు. తాజాగా గీతాంజలి తాను గర్భం దాల్చినట్టు ఓ ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు. ఈ క్రమంలో తన భార్య మరోసారి ప్రెగ్నెంట్ అనే వార్తను సెల్వరాఘవన్ కూడా సోషల్ మీడియాలో ధృవీకరించారు.

సెల్వరాఘవన్ దంపతులకు విషెస్

సెల్వరాఘవన్ దంపతులకు విషెస్

సెల్వరాఘవన్, గీతాంజలి దంపతులు మూడో సంతానం రెడీ అవుతున్న నేపథ్యంలో సన్నిహితులు, స్నేహితులు, నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందజేస్తున్నారు. మీరు అందించిన శుభవార్తకు హ్యాపీగా ఫీలవుతున్నాం. బేబీ నంబర్ 3 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం అంటూ అభిమానులు సందేశాలతో వారిని ముంచెత్తుతున్నారు.

Recommended Video

Suriya Responds On NGK Movie Failure || Filmibeat Telugu
ధనుష్ కోసం స్క్రిప్టు సిద్దం..

ధనుష్ కోసం స్క్రిప్టు సిద్దం..

ఇక సెల్వరాఘవన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం తన సోదరుడు ధనుష్ నటించే పొదుపెట్టాయ్ 2 సినిమా కోసం స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారు. అలాగే ధనుష్ దర్శకత్వం వహించే నాన్ రుద్రన్ అనే సినిమా కోసం కూడా సెల్వరాఘవన్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సన్నివేశాలను చిత్రకరించేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X