ఇండియన్ 2 ఆగిపోయినట్లేనా.. మరో సినిమాపై శంకర్ ఫోకస్?

ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. ఒక దర్శకుడు సినిమా సినిమాకు ఎలా అప్గ్రేడ్ అవ్వాలో చూపించిన ఫస్ట్ ఇండియన్ దర్శకుడు. కథ ఏదైనా కూడా మంచి సోషల్ మెస్సేజ్ ఇవ్వడంలో అయన స్టైలే డిఫరెంట్ గా ఉంటుంది. అసలు మ్యాటర్ లోకి వస్తే ఇప్పుడు శంకర్ ఇండియన్ 2 సినిమాను పూర్తి చేస్తారా లేదా అనేది కన్ఫ్యూజన్ గా మారింది.

2.ఓ సినిమా విషయంలో తేడా కొట్టినప్పటి నుంచి కూడా శంకర్ అంచనాలు చాలా వరకు తప్పుతున్నాయనే చెప్పాలి. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో వెంటనే ఇండియన్ 2ని సెట్స్ పైకి తెచ్చిన శంకర్ వీలైనంత త్వరగా ఆ సినిమాను తెరపైకి తెచ్చి మళ్ళీ ట్రాక్ లోకి రావాలని అనుకున్నారు. కానీ ఆ సినిమా ఏ క్షణాన స్టార్ట్ చేశారో గాని ఊహించని విధంగా అడ్డంకులు వచ్చి పడుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక యాక్సిడెంట్ జరగడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Director shankar change his decision on indian 2 project

అంతకు ముందే సినిమా బడ్జెట్ విషయంలో శంకర్ కు అలాగే నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మధ్య విబేధాలు వచ్చాయి. అవసరం లేని చోట బడ్జెట్ ఎక్కువవుతోందని నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు రూమర్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు మళ్ళీ షూటింగ్స్ మొదలైన సమయంలో ఇంకా లైకా సంస్థ తదుపరి షెడ్యూల్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదట.

Recommended Video

#HBDAnirudh : Dhanush and Anirudh Combo Is Back | Oneindia Telugu

దీంతో శంకర్ నెక్స్ట్ షెడ్యూల్ పై క్లారిటీ ఇవ్వకుంటే తాను మరొక సినిమాను స్టార్ట్ చేసుకుంటానని అన్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. మరి శంకర్ నెక్స్ట్ ఇండియన్ 2తోనే వస్తాడా లేక మరో సినిమాకు సంబంధించిన సీక్వెల్ తో వస్తాడా అనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X