రూమర్సే... సినిమా లేదు...ఫ్యాన్స్ నిరుత్సాహం

'ఐ' షూటింగ్ లో బిజీగా ఉన్న శంకర్.. తదుపరి అజిత్ కోసం మంచి కథను సిద్ధం చేశారని,'రోబో' సీక్వెల్‌లో అజిత్ నటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఆ విషయాలన్నింటినీ శంకర్ ఖండించారు.
ధనుష్ నటించిన 'వేలై ఇల్లా పట్టదారి' చిత్రాన్ని చూసిన శంకర్.. దానిపై తన అధికార ఫేస్‌బుక్ ఖాతాలో స్పందించారు. సినిమా చాలా బాగుందని, తనకెంతో నచ్చిందని ప్రస్తావించారు. ఈ తరుణంలో అజిత్ అభిమాని ఒకరు 'మా హీరో అజిత్‌తో సినిమా తీస్తున్నారట.. నిజమేనా?' అని ప్రశ్నించారు.
దీనిపై శంకర్ స్పందిస్తూ.. ప్రస్తుతం విక్రం హీరోగా నటిస్తున్న 'ఐ' చిత్రీకరణలో బిజీగా ఉన్నాను. ఆ సినిమా విడుదలయ్యేవరకు మరో ప్రాజెక్టు గురించి ఆలోచించ లేదు. అజిత్‌తో సినిమా అంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజంలేదని చెప్పారు. ప్రస్తుతం 'ఐ' విడుదలయ్యాకే తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తానని తెలిపారు శంకర్.


Click it and Unblock the Notifications











