twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకుడు శంకర్‌పై భగ్గుమంటున్న జనం.. మనుషులు చనిపోతుంటే ఇలాంటి ట్వీట్ పెడతావా!

    |

    Recommended Video

    Director Shankar IPL Twitter Comments Goes Controversial

    తమిళ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం పోరాటాల మయంగా మారుతోంది. తమిళ ప్రజలకు ఏ సమస్య వచ్చినా చిత్ర పరిశ్రమ వెంటనే ఆ పోరాటంలో పాల్గొంటోంది. స్టెరిలైట్ కాపర్ సంస్థ విస్తరణని వ్యతిరేకిస్తూ దాదాపు 50 వేలమంది జనం తమిళనాడులో పోరాటం చేస్తున్నారు. కలక్టరేట్ వద్ద జరిగిపిన నిరసనలో పోలీసులు కాల్పులు జరపడం 11 మంది మరణించడం జరిగింది. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ వ్యవహారంలో స్టార్ డైరెక్టర్ శంకర్ తీవ్ర విమర్శల పాలు అవుతున్నారు.

    ప్రతి పోరాటంలో అండగా

    ప్రతి పోరాటంలో అండగా

    తమిళనాడులో ప్రజలకు ఇటివంటి సమస్య తలెత్తినా అక్కడి చిత్ర పరిశ్రమ అండగా నిలబడుతోంది. వారి పోరాటంలో పాలుపంచుకుంటోంది. జల్లి కట్టు, కావేరి జలాలు వివాదం వంటి అంశాలలో తమిళ చిత్ర పరిశ్రమ పోరాటాన్ని మనం గమనించాం.

     కాల్పులు జరిపి దారుణంగా

    కాల్పులు జరిపి దారుణంగా

    100 రోజులుగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమం మంగళవారం రోజు హింసాత్మకంగా మారింది. తూత్తుకుడి వద్ద నిరసన కారులు కలెక్టరేట్ ని ముట్టడించే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించారు.

    శంకర్ పై మండిపాటు

    శంకర్ పై మండిపాటు

    మంగళవారం రోజు ఐపీఎల్ టోర్నీలో భాగంగా చెన్నై, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ని ఉద్దేశించి శంకర్ వాట్ ఏ మ్యాచ్ అంటూ సోషల్ మీడియాలో స్పందించారు. దీనితో శంకర్ పై తమిళ జనం విమర్శలతో విరుచుకుపడుత్నారు. మనుషుల ప్రాణాలు పోతుంటే క్రికెర్ ఎంజాయ్ చేస్తున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు.

    తాజగా మరో ట్వీట్

    విమర్శల తాకిడిని శంకర్ తగ్గించే ప్రయత్నం చేశారు. ఐపీఎల్ మ్యాచ్ ట్వీట్ ని తొలగించిన శంకర్ తాజాగా తూత్తుకుడి ఘటనపై ట్వీట్ చేసారు. ఇది అత్యంత భాదాకరమైన ఘటన అని, మరణించిన వారి కుటుంబాలకు ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నా అంటూ శంకర్ ట్వీట్ చేశారు.

    సహించరాని ఘటన

    ఈ ఘటనపై సీనియర్ నటి రాధిక స్పందించారు. ఏమాత్రం సహించరాని ఘటన ఇది అని ఆమె అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేసారు.

    విశాల్ ఎమోషనల్‌గా

    విశాల్ ఎమోషనల్‌గా

    ఈ ఘటనపై హీరో విశాల్ ఎమోషనల్ అయ్యారు. ఇప్పటికైనా ప్రధానిమౌనం వీడాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నా అని విశాల్ అన్నారు. 50 వేల మంది చేస్తున్న పోరాటం సామాన్యమైనది కాదని, ఇది సమాజం కోసం జరుగుతున్న పోరాటం అని అన్నారు.

    English summary
    Director shankar gets trolled for his tweet. Thoothukudi incident is hot topic in Kollywood
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X