మహేష్ బాబుతో రోబో డైరెక్టర్ తెలిసే తప్పు చేస్తున్నాడా...
'రోబో"ఘనవిజయం సాధించినప్పటికీ ఈ సినిమా కాపీ వివాదంతో శంకర్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ కథ మాది అంటే మాది అని తెలుగు, తమిళ రచయితలు శంకర్ మీద ఇప్పటికీ దాడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ కొత్త కొత్త అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే శంకర్ తనకంటూ కొంతమంది ప్రత్యేకమైన అభిమానులను కూడా సంపాదించుకున్నారు. పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ శంకర్ కు ఒక్క ఓటమి కూడా లేదు. అలాంటిది ఆయన ఇప్పుడు తెలిసి తెలిసీ తప్పటడుగు వేస్తున్నారా? అని చాలా మంది ఆలోచనలో పడుతున్నారు. విషయం ఏమిటంటే శంకర్ తీస్తున్న త్రీ ఇడియట్స్ అతని కెరీర్ కు ఎంతవరకు హెల్స్ అవుతుందన్నది కోలీవుడ్ గుసగుస. రీమేక్ లు శంకర్ కు పనికిరావని, నిదానంగానైనా సొంత కథతో సినిమా తీసుకుంటే ఉత్తమమని వారి సలహా.
మహేష్ బాబు శంకర్ రోబో త్రీ ఇడియట్స్ ఇలియానా జీవా విజయ్ mahesh babu shankar robo 3 idiots ileana jeeva vijay


Click it and Unblock the Notifications