1000 కోట్లు మిస్.. రోబో కాంట్రవర్సీపై శంకర్ .. ఓపెన్ అయ్యిన ఇండియన్ జేమ్స్ కామెరాన్
ఇపుడు భారతీయ సినిమా కోసం ప్రపంచం అలాగే పాన్ ఇండియా లెవెల్లో మాట్లాడుకుంటున్నాం కానీ ఇప్పటికి పది పదిహేనేళ్ళు అంతెందుకు రెండు దశాబ్దాల కితమే తన విజన్ తో ఓ రేంజ్ లో సౌత్ సినిమా అంటే ఏంటో చూపించిన వన్ అండ్ ఓన్లీ దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఇండియన్ జేమ్స్ కామెరాన్ గా పిలవబడే దర్శకుడు శంకర్ అనే చెబుతారు.
కాగా ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర నెంబర్ 1 దర్శకుడిగా చెప్పుకునే ఎస్ ఎస్ రాజమౌళి సైతం తమకి "ఓజి" డైరెక్టర్ ఎవరు అంటే శంకర్ అని చెప్పిన రేంజ్ తనది. అయితే ఇలాంటి ఓజి దర్శకుడు ఇపుడు దారుణంగా డౌన్ ఫాల్ లో ఉన్నారు. కాగా తాను తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్, భారతీయుడు 2 సినిమాలు దారుణంగా డిజాస్టర్స్ కావడం శంకర్ ని మరింత వెనక్కి లాగేసింది.

అలాగే తన ఫ్యాన్స్ కూడా డిజప్పాయింట్ అయ్యారు. కాగా ఇవి చాలవు అన్నట్టుగా శంకర్ పై పలు కాంట్రవర్సీలు కూడా వస్తుండడం మొదలైంది. సినిమా బడ్జెట్ లు వేస్ట్ చేయిస్తున్నారని కొందరు ఒక పక్క నా కథ కాపీ కొట్టి రోబో సినిమా తీసారని ఇంకొకరు ఓ పక్క ఇలా కాంట్రవర్సీలు కూడా శంకర్ ఎదుర్కోక తప్పడం లేదు.
కాగా శంకర్ తెరకెక్కించిన ఎపిక్ వండర్స్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేసిన భారీ హిట్ చిత్రం "రోబో" కూడా ఒకటి. ఇదే సినిమా ఇపుడు గనుక వచ్చి ఉంటే ఈజీగా 1000 కోట్లు చేసి ఉండేది అనే రేంజ్ సినిమాని శంకర్ పదిహేనేళ్ల కితం తీసి అందించారు. కాగా ఈ సినిమా నా కథని కాపీ కొట్టి తీశారు అని తమిళ నాట ఆరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011 లో కేసు వేయడం జరిగింది.
తాను రాసుకున్న కథ జిగుబా అనే దానికి ఎంతో సాపత్యం ఉందని శంకర్ నా కథనే కాపీ కొట్టి రోబో సినిమా తీసారని వేసిన కేసులో లేటెస్ట్ గా ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్మెంట్) వారు శంకర్ నుంచి 10 కోట్ల విలువైన ఆస్తులు తాత్కాలికంగా అటాచ్ చేయడం షాకింగ్ గా మారింది. అయితే దీనిపై శంకర్ స్పందించినట్టుగా తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. శంకర్ ఈ కేసు విషయంలో తీవ్ర విచారం వ్యక్తం చేశారట.

అసలు ఈ కేసులో తమిళనాడు న్యాయస్థానం తనకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది అని ఆ తీర్పు ఉన్నప్పటికీ ఈడీ వారు ఇలా చేయడం బాధించింది అని శంకర్ తెలిపారట. అలాగే ఆల్రెడీ నాయస్థానం నుంచి నాకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ ఈడీ వారు తనపై ఇలా చేయడం న్యాయస్థానం తీర్పుని ఉల్లంగించినట్టే అవుతుంది అని శంకర్ సూచించారట.
అలాగే సరైన ఆధారాలు కూడా లేకుండా ఈడీ వారు తన ఆస్తులని ఎలా అటాచ్ చేస్తారని శంకర్ ప్రశ్నించారట. మరి శంకర్ వెర్షన్ ప్రస్తుతం బయటకి రావడంతో సినీ వర్గాల్లో ఇవి వైరల్ గా మారాయి. మరి సడెన్ గా వెలుగులోకి వచ్చిన ఈ రోబో కాంట్రవర్సీపై శంకర్ వెర్షన్ కి ఈడీ ఎలాంటి సమాధానం ఇస్తుంది అనేది ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











