శంకర్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ.. ఆ స్టార్ హీరోలతో చర్చలు!
కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి చిత్రాలతో గుర్తింపునందుకున్న దర్శకుడు శంకర్ తెలుగులో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక శంకర్ రోబో సినిమాతో ఫ్యాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద అసలైన సక్సెస్ అందుకున్నాడు. అయితే శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా RC 15వ ప్రాజెక్టును తెరపైకి తీసుకు వస్తున్నాడు. అంతేకాకుండా కమల్ హాసన్ తో పాన్ ఇండియన్ సీక్వెల్ ను కూడా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఇక లిస్టులో మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇదివరకే అపరిచితుడు సెకండ్ పార్ట్ కూడా ఉండబోతున్నట్లుగా తెలియజేశాడు. అయితే ఆ కథలో బాలీవుడ్ హీరో రణ్ వీర్ ఉండబోతున్నట్లు అధికారికంగా క్లారిటీ కూడా ఇచ్చారు అయితే ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో ఒక కొత్త టాక్ వైరల్ గా మారిపోయింది.

దర్శకుడు శంకర్ ఇండియాలోనే అతిపెద్ద బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ ప్రాజెక్టును కూడా హ్యాండిల్ చేయబోతున్నట్లు కథనాలు వెలబడుతున్నాయి. దాదాపు 900 కోట్ల బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఆ సినిమా ఉండబోతుంది అని గతంలోని ఒక టాక్ అయితే వినిపించింది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న మరొక టాక్ ప్రకారం ఆ ప్రాజెక్టులో ప్రముఖ బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ అలాగే కోలీవుడ్ స్టార్ విజయ్ ఇద్దరు కూడా నటించబోతున్నట్లుగా కొన్ని కథనాలు వస్తున్నాయి.
ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక మార్కెట్ ఉన్న హీరోలలో షారుక్ ఖాన్ విజయ్ ఉన్నారు. అత్యధిక స్థాయిలో 100 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్న హీరోలలో ఈ ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి వారి రేంజ్ కు తగ్గట్టుగానే ఆ ప్రాజెక్టును తెరపైకి తీసుకురావడానికి చర్చలు మొదలుపెట్టే అవకాశం ఉందట. ఇక ప్రస్తుతం శంకర్ చేతిలో ఉన్న ప్రాజెక్టులో పూర్తయిన తర్వాత ఆ ప్రాజెక్టు ప్రణాళిక గురించి ఆలోచించే అవకాశం ఉంది. ఇక రామ్ చరణ్ సినిమాతో పాటు ఇండియా 2 రెండు కూడా వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.


Click it and Unblock the Notifications











