అంగరంగవైభవంగా క్రికెటర్ తో శంకర్ కుమార్తె పెళ్లి.. మొత్తం ఐదు బాషల సెలబ్రిటీలకు పిలుపు!

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇప్పుడు కమల్ హాసన్ తో చేయాల్సిన ఇండియన్ 2 సినిమా సహా మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ తో సహా రణవీర్ సింగ్ తో కూడా తో సినిమాలు అనౌన్స్ చేసిన ఆయన ఇప్పుడు ఏ సినిమా మొదలుపెట్టాలో కూడా అర్ధం కాని పొజిషన్ లో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన కూతురి పెళ్లి విషయంలో బిజీగా ఉన్నాడు. ఆయన అల్లుడు ఎవరు అనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

 పెళ్లి పనుల్లో బిజీ

పెళ్లి పనుల్లో బిజీ

పెద్ద కుమార్తె వివాహం కారణంగా శంకర్ అన్ని పనులు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ సినిమా కోసం జరుగుతున్న ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో నిలిపివేసిన ఆయన పూర్తిగా అన్ని పనులు నిలిపివేశారు. శంకర్ ఇప్పుడు తన పెద్ద కుమార్తె అదితి శంకర్ వివాహ ఏర్పాట్లలో మునిగిపోయారు. అదితి నిశ్చితార్థం చెన్నైకి చెందిన వ్యాపారవేత్తతో జరిగిందని ప్రచారం జరగగా అది నిజం కాదని తెలిసింది.

 జూన్ 27న వివాహం

జూన్ 27న వివాహం

జూన్ 27న పుదుచ్చేరికి చెందిన క్రికెటర్ రోహిత్‌కు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్యకు ముడి పడబోతోంది. అయితే వివాహం కేవలం అది కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక రిసెప్షన్ మాత్రం కోవిడ్ హడావుడి మొత్తం తగ్గాక ఐదు పరిశ్రమలు అంటే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ మొదలు బాలీవుడ్ దాకా ప్రముఖులను ఆహ్వానించడానికి పెద్ద ఎత్తున ప్రణాళిక చేయబడిందని అంటున్నారు.

ఫోటో వైరల్

ఫోటో వైరల్

మరో రెండు రోజుల్లో వీరి వివాహం తమిళనాడులోని పొల్లాచ్చిలో జరగబోతోంది. ఇప్పటికే శంకర్ కుటుంబం మొత్తం పొల్లాచి చేరినట్లు తెలుస్తోంది. ఆ వివాహ వేడుకలో దగ్గర నుంచి విడుదలైన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సదరు వరుడు ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక శంకర్ సినిమాల విషయానికి వస్తే ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

లైకా ప్రొడక్షన్ బ్రేకులు

లైకా ప్రొడక్షన్ బ్రేకులు

ఆయన కమల్ హాసన్ తో చేస్తున్న సినిమా షూటింగ్ అయిపోయింది. ఎన్నిసార్లు మొదలుపెట్టాలి అని అనుకున్నా మొదలు కాలేదు. ఈ నేపథ్యంలో ఆయన మరో రెండు సినిమాలు ప్రకటించడం, ఆ తర్వాత ఆ రెండు సినిమాలకు లైకా ప్రొడక్షన్స్ సంస్థ బ్రేకులు వేయడానికి ప్రయత్నాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక శంకర్ చివరిగా రోబో 2 అనే సినిమా చేశారు.

సినిమాల విషయానికి వస్తే

సినిమాల విషయానికి వస్తే

శంకర్ రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో రాంచరణ్ -15 సినిమా మొదలు పెట్టారు.. అయితే తమ సినిమా పూర్తి కాకుండానే మరో ప్రాజెక్ట్ చేస్తున్నాడని చెబుతూ శంకర్ మీద ఇండియన్ నిర్మాతలు కోర్టును ఆశ్రయించడంతో రామ్ చరణ్ సినిమా చిక్కుల్లో పడింది. ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే ఆయన మరో సినిమా కూడా బాలీవుడ్లో ప్రకటించారు. విక్రమ్ హీరోగా అపరిచితుడు సినిమా చేయగా దానిని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X