విక్రమ్ 'ఐ' దర్శకుడు శంకర్‌ ఇంటర్వూ

By Srikanya

చెన్నై : ప్రముఖ తమిళ దర్శకుడు సినిమాలంటే తమిళంలోనే కాదు,తెలుగులోనూ మంచి క్రేజు. బ్లాక్‌బస్టర్‌ దర్శకుడిగానే కాదు, భారీ బడ్జెట్‌ చిత్రాల మేకర్‌గా కూడా శంకర్‌కు పేరుంది. ఆయన రూపొందించిన వాటిలో బాయ్స్‌ మినహా జెంటిల్‌మేన్‌, ప్రేమికుడు‌, భారతీయుడు‌, ఒకే ఒక్కడు‌, అపరిచితుడు‌, నన్బన్‌ ఆ కోవకు చెందినవే. ప్రస్తుతం విక్రమ్‌ హీరోగా 'ఐ' రూపొందిస్తున్నాడు. ఎమీ జాక్సన్‌ 'చియాన్‌' సరసన ఆడిపాడుతోంది.

'అపరిచితుడు'గా విక్రంను తీసుకువచ్చి దక్షిణాదికే సుపరిచితం చేసిన శంకర్‌.. మళ్లీ 'ఐ'తో మరో విజయాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. 'ఐ' కోసం నటుడు విక్రం సకలవిధాలా తనను తాను మలుచుకుంటున్నారు. కథకు తగ్గట్లు తన శరీరాకృతిని మార్చుకుంటున్నారట. మూడు భిన్న కోణాల్లో విక్రం కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక విషయాలేవీ బయటకు రాకపోయినా.. కొన్ని మాత్రం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి.

ఇందులో రెండు పాత్రల్లో విక్రం చాలా సన్నగా కనిపించాలని దర్శకుడు చెప్పారట. ఇప్పటికే ఓ పాత్రకు సంబంధించిన ఫొటోలు వచ్చాయి. అందులో విక్రం నేటితర యువకుడిలా బక్కపలచగా కనిపిస్తున్నారు. మరో పాత్ర కోసం ఇంకాస్త సన్నబడినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. సినిమా కోసం నటుడు విక్రమ్‌ వూహించని స్థాయిలో సన్నబడ్డాడు. పదహారేళ్ల యువకుడిలా.. నేటిశైలికి తగ్గట్టు శరీరాకృతిని మలచుకున్నాడు. తాజాగా విడుదలైన ఆయన ఫొటో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రథమార్థంలో సాధారణంగా కనిపించాడట. ద్వితీయార్థంలోని పాత్ర కోసం విక్రమ్‌ ఇలా మారాడని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం విక్రమ్‌ చాలా శ్రమించాడట. '84 కిలోల బరువుండే నేను ఈ పాత్ర కోసం 14 కిలోలు తగ్గానని' విక్రమ్‌ చెప్పాడు.

ఈ సినిమాలోని విక్రంను చూస్తేనే అందరిలోనూ ప్రశ్నల శరాఘాతం ఆరంభమవుతుంది. ఇంత సన్నగా ఎలా అయ్యాడబ్బా అని సందేహం తలెత్తకమానదు. స్లిమ్‌విక్రం, ఏఆర్‌ రెహ్మాన్‌, పీసీ శ్రీరాం.. ఈ అద్భుతమైన కలయికలో వస్తున్న 'ఐ' చిత్ర విశేషాల గురించి శంకర్‌ ఏమన్నాడో తెలుసుకుందామా..

స్లైడ్ షోలో శంకర్ ఇంటర్వూ...

'ఐ' ప్రత్యేకతలు వివరిస్తారా?

'ఐ' ప్రత్యేకతలు వివరిస్తారా?

శంకర్ : చాలా క్రిస్పీ, రొమాంటిక్‌ థ్రిల్లర్‌ చిత్రం. ఇదివరకు నేను ఎంచుకోని అంశం. చిత్రంలో విక్రం సహా ప్రతి ఒక్కరికీ స్పెషల్‌ మేకప్‌ అవసరమైంది. అందుకే ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థ ఏదని వెతికాం. 'లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌', 'హ్యాబిట్‌' చిత్రాలకు పనిచేసిన 'వెట్టా స్టూడియోస్‌' గురించి అందరూ చెప్పారు. వారు 'రోబో‌' చూశారట. మేం వెళ్లగానే ఆ సినిమా గురించి చర్చించారు. హాలీవుడ్‌లోనూ చాలా రోబో సినిమాలు వచ్చాయి.

కానీ 'రోబో ‌'లో ప్రతి సన్నివేశం కొత్తగా ఉంది... అలాంటి క్త్లెమాక్స్‌ ఎక్కడా చూడలేదని అభినందించారు. ఆ తర్వాత 'ఐ' చిత్ర కథ చెప్పాం. 'చాలా గొప్పగా ఉంది... ఈ సినిమాకు పనిచేయడం సవాల్‌తో కూడుకున్న విషయం' అంటూ వెంటనే పనిలో నిమగ్నమయ్యారు. 'సార్‌.. ఇకపై మీ సినిమాలన్నీ మాతో చర్చించండి. అన్నింటికీ మేమే చేస్తాం. బిజినెస్‌ గురించి తర్వాత మాట్లాడుకుందాము'అని అడిగారు. అలా 'ఐ' చిత్రం చాలా సేఫ్టీగా ల్యాండ్‌ అవుతోంది.

హీరో విక్రమ్ పాత్రేంటి?

హీరో విక్రమ్ పాత్రేంటి?

శంకర్: అది మీరు థియేటర్‌కు వెళ్లి చూడాల్సిందే. మీరు ఎలాంటి అంచనాలతో సినిమా చూడటానికి వస్తారో.. అందుకు రెట్టింపు ఆశ్చర్యాన్ని కలుగజేస్తాడు స్లిమ్‌ విక్రం. మేకప్‌ మాత్రమే నా ఐడియా. అలా వెయిట్‌ తగ్గడం విక్రం ఆలోచనే. అంత స్లిమ్‌ అవడానికి ఆయన సరిగ్గా ఆహారం తీసుకోవడం లేదని చెప్పడం కన్నా.. అసలు అన్నం తినడమే మానేశారని చెప్పాలి! స్పాట్‌లో అందరూ బిర్యానీ తినేటప్పుడు ఆయన మాత్రం దూరంగా ఉన్నారు. అందువల్లే త్వరగా సన్నబడ్డారు.

ఎమీ జాక్సన్‌ను హీరోయిన్ గా ఎంచుకోవడానికి కారణం?

ఎమీ జాక్సన్‌ను హీరోయిన్ గా ఎంచుకోవడానికి కారణం?



శంకర్ : 'ఐ' అంటే చాలా అర్థాలున్నాయి. అందులో 'అందం' కూడా ఒకటి. అందంతో ముడిపడే కథ కావడంతో ఏంజెల్‌ లాంటి అమ్మాయి కోసం వెతికాం. ఆ పాత్రకు ఎమీ జాక్సన్‌ సరిగ్గా అనిపించేసరికి ఎంచుకున్నాం. బ్రిటీష్‌ అమ్మాయి ఈ పాత్రకు సూట్‌ అవుతారా అన్న సందేహం కూడా ఏర్పడింది. పీసీ శ్రీరాం కెమెరా పనితనంతో ఆ సందేహాలు తొలగిపోయాయి. తమిళంలో మాట్లాడటం కోసం ఆమె చాలా హోంవర్క్‌ చేశారు.

షూటింగ్ జరిపేటప్పుడు పీసీ శ్రీరాంతో విభేదాలు ?

షూటింగ్ జరిపేటప్పుడు పీసీ శ్రీరాంతో విభేదాలు ?

శంకర్: అలాంటిదేం లేదు. అన్నీ రూమర్సే. ఆయన అనుకునే ఫ్రేమ్‌కు మనం మెటీరియల్‌ అందించడమే పెద్ద విషయం. ఈ సినిమాను ప్రారంభించే ముందు 'కెమెరామెన్‌ ఎవరు'అని ప్రభుదేవా అడిగారు. పీసీ శ్రీరాం అని చెప్పా. 'సూపర్‌. మీ ఇద్దరికి సూపర్‌గా సూట్‌ అవుతుంది'అని అన్నారు. ఆయన అన్నట్లే సినిమా సాగుతోంది. బయట ఆయన టాప్‌గా కనిపించినా.. సన్నిహితమైతే ఆయన చంటిపిల్లాడితో సమానం.

అప్పటి- ఇప్పటి రెహ్మాన్‌కు తేడా ఉందా?

అప్పటి- ఇప్పటి రెహ్మాన్‌కు తేడా ఉందా?

శంకర్: ఆయన పనితనంలో ఇంకా నాణ్యత పెరిగింది. సినిమా ప్రారంభంలో ఓ ట్యూన్‌ చేసిచ్చారు. అది నచ్చింది.. కానీ ఏడాది అయింది కదా... ఇప్పుడు మళ్లీ కొత్తగా అప్‌డేట్‌ చేసిస్తానని తనే మార్చి ఇంకాస్త మంచిగా ఇచ్చారు. అదీ ఆయన ప్రత్యేకత.

మీ ఈ సినీ ప్రస్థానంలో నేర్చుకున్న విషయాలు?

మీ ఈ సినీ ప్రస్థానంలో నేర్చుకున్న విషయాలు?

శంకర్: ఈ ఇరవై ఏళ్ల కేరీర్‌ నాకు నాలుగైదేళ్లు మాదిరిగానే ఉంది. ప్రతి సినిమానూ తొలి చిత్రంగానే భావించి తెరకెక్కిస్తున్నా. చిత్ర పరిశ్రమలో సమాయానికి అనుగుణంగా అప్‌డేట్‌ అవుతుండాలి. లేకుంటే మనల్ని దాటుకుని వెళ్లిపోతుంటారు. రెండేళ్లు అయినా కూడా ఆ చిత్ర కథ చాలా కొత్తగా అనిపించాలి. అలా అయితేనే రాణించగలం. ఈ పందెంలో పరిగెత్తగలం.. గెలవగలం.

ఇటీవల మీకు నచ్చిన చిత్రాలేంటి?

ఇటీవల మీకు నచ్చిన చిత్రాలేంటి?

శంకర్ : 'మూడర్‌కూడం' నచ్చింది. నా నిర్మాణంలోని ఎస్‌ పిక్చర్స్‌ బ్యానర్లో ఈ సినిమాను రూపొందించి ఉండొచ్చని అనుకున్నా. 'సూదుకవ్వుం', 'నడువుల కొంజం పక్కత్త కానోం'.. సినిమాలు కూడా అలాగే అనిపించాయి. ఇలాంటి సినిమాలే కోలీవుడ్‌కు ఆక్సిజన్‌ అందిస్తాయి.

కీ రోల్స్ లో ...

కీ రోల్స్ లో ...

మలయాళ అగ్రనటుడు సురేష్‌గోపి, హాస్యనటుడు సంతానం కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకడు రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసారు. పీసీ శ్రీరామ్ కెమెరామేన్. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేస్తారు. శుభతో కలిసి శంకర్ కూడా కథను రాశారు. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రానున్న ఈ సినిమాను అంతే అపురూపంగా నెక్స్ట్ లెవల్ సినిమాగా తీర్చిదిద్దుతున్నారట శంకర్.సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌. ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరాం.

అదే క్రేజ్...

అదే క్రేజ్...


శంకర్ దర్శకత్వంలో సినిమా వస్తోందంటే భాషా బేధం లేకుండా సినీ అభిమానులందిరిలోనూ ఆసక్తి. హాలీవుడ్‌ టెక్నిషియన్స్ ను సైతం 'రోబో'తో ఆశ్చర్యపరిచిన దర్శకుడు శంకర్ ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుని డైరక్ట్ చేస్తూండటంతో మరింత క్రేజ్ క్రియేట్ అయ్యింది‌. కాలానుగుణంగా సినిమాలను తెరకెక్కించి.. ప్రభంజనం సృష్టించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. భారీ విజయాలు సాధిస్తున్న 'ఒకే ఒక్కడు'గా పేరు సంపాదించుకున్నాడు.

కథ ఇదా

కథ ఇదా


ఈ చిత్రంలో విక్రమ్...తమిళనాడు స్టేట్ భాక్సింగ్ ఛాంపియన్ గా కనిపించనున్నాడని సమాచారం. . ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది 'ఐ' చిత్ర కథ అని వినపడుతోంది. అందుకోసం ఆయన ఎనిమిది కేజీలు పైగా బరువు తగ్గారు. ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఐ చిత్రం ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో సాగుతుందనే సమాచారం. ఈ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని శంకర్ ఐ చిత్రాన్ని ఓ రేంజిలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది ఐ చిత్ర కథ అని వినపడుతోంది.

బెస్ట్ ప్లేసెస్ లో...

బెస్ట్ ప్లేసెస్ లో...

ఈ చిత్రాన్ని తెలుగులో ‘మనోహరుడు' అనే టైటిల్ ఖరారు చేసారు. విక్రమ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దాదాపు రూ. 70 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తన రేంజికి తగిన విధంగా భారీ లొకేషన్లలో చిత్రీకరిస్తున్నారు. సినిమా గ్రాండ్‌గా రావడానికి బెస్ట్ లొకేషన్లు ఎంపిక చేసుకున్నాడు. గతంలో శంకర్ నిర్మించిన ‘జీన్స్' చిత్రంలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో పాటు పలు ప్రపంచ ప్రసిద్ధ లొకేషన్లు చూపించారు. తాజాగా ఐ చిత్రం కూడా వరల్డ్ బెస్ట్ ప్లేసెస్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు.

హాలీవుడ్ నుంచీ...

హాలీవుడ్ నుంచీ...

సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘హారీపొటర్' చిత్రానికి పనిచేసిన ఆస్ట్రేలియన్ కంపెనీ స్పెషల్ ఎఫెక్ట్స్‌ని అందించనుంది. ‘మెన్ ఇన్ బ్లాక్ ' చిత్రానికి పనిచేసిన మారీ ఓగ్ట్ ఈ చిత్రానికి కాస్టూమ్స్ డిజైనర్‌గా సేవలందించనున్నాడు. చైనాకు చెందిన ఫైట్‌మాస్టర్ పీటర్ మింగ్ ఈ చిత్రానికి పోరాట దృశ్యాలని సమకూర్చనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X