ఆమె చెంపచెల్లుమంది!!
మందు కొట్టడంలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న తమిళ నటి పద్మప్రియ చెంప చెల్లుమంది. తమిళ సినిమా మిరుగమ్ సినిమా సెట్స్ లో ఆ చిత్ర దర్శకుడు సమీ చెల్లుమనిపించాడు. యూనిట్ సాక్షిగా ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఆయన ఈ పని చేసింది మాత్రం ఆమె మందు కొట్టినందుకు కాదు. ఎందుకు కొట్టినా ఆమె మాత్రం నదిగర్ సంగమ్ కు ఫిర్యాదు చేసింది. నదిగర్ సంగమ్ ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తోంది.
తానేం తప్పుచేయకున్నా సమీ అందరిముందు కొట్టాడు. పనిచేసేవారిని విసిగిస్తున్నాడు సమీ. ఈయన సినిమాకు ఒప్పుకోవడం జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. ఈ సినిమా కోసం 68 రోజుల కాల్షీట్స్ కేటాయించాను..ఇన్ని రోజులు ఏ హీరోయిన్ కేటాయిస్తుంది చెప్పండి..సెట్స్లో ప్రతి షాట్ తరువాత తిట్ల పురాణం మొదలెడతాడు. అదీ కూడా మైక్ లో.బహుషా ఆయన సైకో కావచ్చు...సినిమాకు ఒప్పుకునేముందు ఆయన ఎలాంటి వాడే విచారించాల్సింది..స్క్రిప్ట్ లో ఉన్న దానికన్నా ఎక్కువగా ఎక్స్ పోజ్ చేయమన్నాడు..అని పద్మప్రియ వాపోయింది. అంతకుముందు సమీ ప్రెస్మీట్ లో మాట్లాడుతూ ఇలాంటి నటిని తానెప్పుడు చూడలేదంటున్నాడు. షూటింగ్ కు చాలా ఇబ్బందులు కలిగిస్తోందన్నాడు. తాను కూడా నదిగర్ సంగమ్ కు ఫిర్యాదు చేసినట్టు చెప్పాడు.


Click it and Unblock the Notifications











