డైరక్టర్ గారి నైట్ క్లబ్ యవ్వారం
7/g బృందావన కాలనీ, ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే వంటి చిత్రాలతో తెలుగు వారికి పరిచయమైన సెల్వరాఘవన్ తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నారు. అసలే సోనీ అగర్వాల్ తో సరిపడక విడాకులుకు అప్లై చేసుకున్న రాఘవన్ తన తాజా చిత్రంలో చేస్తున్న ఆండ్రూ అనే హీరోయిన్ తో జతకట్టారు. ఇద్దరూ షూటింగ్ అయిపోగానే పబ్ లకు వెళ్తున్నారు. అయితే పబ్ లో ఆమె డాన్స్ చేస్తూంటే అతను చేయక ఆమెను ఇబ్బంది పెట్టసాగాడు. పోనీ ఆమె వేరే వారితో స్టెప్స్ వేస్తుంటే ఒప్పుకోలేదు. దాంతో అసలే త్రాగి విసుగు మీద ఉన్న ఆమె అతనిపై విరుచుకుపడింది. ఇద్దరి మధ్యా గొడవపెరిగింది. తనని అల్లరి పెడుతున్నాడంటూ పబ్ మేనేజర్స్ కి చెప్పి బయిటకు పంపించింది. ఇక ఈ విషయం ఓ లోకల్ న్యూస్ పేపర్ లో వచ్చింది. అనంతరం పెద్ద పేపర్లు వారు కూడా కవర్ చేసారు. అయితే దీన్ని సెల్వ రాఘవన్ ఖండిస్తున్నాడు.ఆ సంఘటన అంతా కొంత మంది మానసిక బలహీనుల ఊహ మాత్రమే. నేను ఊళ్సో లేనిదో పబ్ కి ఎలా వెళ్తాను.. ఎలా ఈ గొడవలో ఉంటాను అని వాదిస్తున్నాడు. అయితే రాఘవన్ దురదృష్టమేమిటంటే ఆ సమయంలో కొంతమంది దాన్ని సెల్ కెమెరాలతో చిత్రీకరించారు. ఆ ఎమ్.ఎమ్.ఎస్ లు ఇప్పుడు సిటీ అంతటా పరిభ్రమస్తున్నాయి.


Click it and Unblock the Notifications











