శ్రీరెడ్డికి ఎదురుదెబ్బ.. చెన్నైలో కేసు? ఆరోపణలన్నీ అబద్దాలే.. లారెన్స్, శ్రీకాంత్ ఫైర్

By Rajababu

Recommended Video

Sri Reddy Faces A Complaint In Chennai

తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులపై విరుచుకుపడుతున్న శ్రీరెడ్డికి షాకిచ్చేందుకు దర్శకుడు సుందర్ సీ సిద్ధమవుతున్నాడు. ప్రముఖ కుష్బూ భర్త అయిన సుందర్ సీపై శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సుందర్ సీ సిద్దమవుతున్నట్టు సమాచారం. సుందర్ సీపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవే.

సుందర్ సీ‌తో తాను

సుందర్ సీ‌తో తాను

హైదరాబాద్‌లో అరన్‌మనయ్ షూటింగ్ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత గణేష్‌తో కలిసి వెళ్లి సుందర్ సీని కలిశాను. ఆ రోజే నా ఫేస్‌బుక్ ఫ్రెండ్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌ను కలిశాను. ఆ సందర్భంగా తన తదుపరి చిత్రంలో నాకు అవకాశం ఇస్తాను అని చెప్పారు. ఆ తర్వాత నన్ను నోవాటెల్‌కు రమ్మన్నాడు. శారీరక సుఖాన్ని ఇవ్వమని కోరాడు. ఆ తర్వాత ఏదో జరిగిపోయింది అని శ్రీరెడ్డి ఫేస్‌బుక్ పోస్టులో వెల్లడించింది.

లారెన్స్, హీరో శ్రీకాంత్‌పై కామెంట్స్

లారెన్స్, హీరో శ్రీకాంత్‌పై కామెంట్స్

అంతేకాకుండా నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు లారెన్స్ రాఘవ, మరో హీరో శ్రీకాంత్‌పై కూడా శ్రీరెడ్డి దారుణమైన కామెంట్లు చేసింది. శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై లారెన్స్, శ్రీకాంత్ కూడా స్పందించారు. శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలే. నిజం లేదు అని మీడియాకు ఓ ప్రకటన జారీ చేశారు. సినిమా అవకాశాల కోసం ఒకరిని సిఫారసు చేసే అలవాటు తనకు లేదని శ్రీకాంత్ వెల్లడించారు.

శ్రీరెడ్డి ఆరోపణలు అవాస్తవమని

శ్రీరెడ్డి ఆరోపణలు అవాస్తవమని

శ్రీరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సుందర్ సీ ఖండించారు. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదు. ఆమె చెప్పేదంతా అబద్దమే. తనపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డిపై కేసు నమోదు చేయనున్నాను. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాను అని సుందర్ సీ చెప్పారు.

సినీ ప్రముఖులపై ఫిర్యాదుకు శ్రీరెడ్డి

సినీ ప్రముఖులపై ఫిర్యాదుకు శ్రీరెడ్డి

క్యాస్టింగ్ కౌచ్‌పై ఉద్యమిస్తున్నానని చెప్పుకొంటున్న శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు. చెన్నై మీడియాలో ఆమె హల్‌చల్ చేస్తున్నారు. కొందరిపై తాను ఫిర్యాదు చేయనున్నట్టు ఇటీవల ఆమె మీడియాతో అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X