రజనీకాంత్ అల్లుడికి షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చిన దర్శకుడు
తమిళంలో స్టార్ హీరో ఇమేజ్ సంపాదించుకున్న ధనుష్ కి రీసెంట్ గా ఓ చేదు అనుభవం ఎదురైంది. రజనీకాంత్ కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచిన మాపిళ్ళై చిత్రం రీమేక్ గా అదే టైటిల్ తో రూపొందుతున్న సినిమా డబ్బింగ్ సమయంలో డైరక్టర్ సూరజ్ అతనికి ట్విస్ట్ ఇచ్చారు. ఈ చిత్రానికి డైరక్టర్ కమ్ పైనాన్సియర్ అయిన సూరజ్ ని ఈ చిత్రం షూటింగ్ సమయంలో నానా రకాలుగా ధనుష్ ఇబ్బందిపెట్టినా డబ్బు ఇరుక్కుపోయిందని భరించి షూటింగ్ పూర్తి చేసాడు. అయితే డబ్బింగ్ చెప్పకుండా మూడు నెలల నుంచి ధనుష్ వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. అప్పటికే సినిమా ప్రారంభమై చాలా కాలం అయిపోయింది.
ఈ సినిమా కోసం చేసిన అప్పుల వడ్డీలు పెరిగిపోవటంతో ఎలాగయినా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్న సూరజ్..తనే డబ్బింగ్ స్టూడియోకు పోయి ధనుష్ కి డబ్బింగ్ చెప్పటం మొదలెట్టాడు. దాంతో ఖంగుతిన్న ధనుష్ డబ్బింగ్ ధియోటర్ కి చేరుకున్నాడు. కానీ అప్పటికే సగం డబ్బింగ్ చెప్పిన సూరజ్ కుదరదని తనే ఫినిష్ చేసి రిలీజ్ చేస్తానని అన్నాడు. దాంతో తన వాయిస్ కాకుండా వేరే వాయిస్ తో సినిమా రిలీజ్ అయితే వ్యక్తిగతంగా తనకే నష్టమని అర్దం చేసుకున్న ధనుష్ కొందరు సినిమా పెద్దలని మధ్యవర్తులుగా చేసి సమస్యను పరిష్కరించుకున్నాడు. మొత్తానికి ధనుష్ పొగరు ఈ దర్శకుడు బాగా అణిచారని మిగతా నిర్మాతలు అంటున్నారు. ఇక ఈ చిత్రంలో ధనుష్ సరసన హన్సిక హీరోయిన్ గా చేసంది. అలాగే కీలకమైన అత్త పాత్రలో మనీషా కొయరాలా కనిపించనుంది.


Click it and Unblock the Notifications











